LOADING...
Raaka : అల్లుఅర్జున్ ర్యాంపేజ్ మొదలు… 'రాకా'పై భారీ హంగామా
అల్లుఅర్జున్ ర్యాంపేజ్ మొదలు… 'రాకా'పై భారీ హంగామా

Raaka : అల్లుఅర్జున్ ర్యాంపేజ్ మొదలు… 'రాకా'పై భారీ హంగామా

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
04:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లు అర్జున్ నటించిన పుష్ఫ సినిమా తర్వాత ఆయన స్థాయి పూర్తిగా మారిపోయింది. ఈ చిత్రంతో ఆయన మార్కెట్ కేవలం దక్షిణ భారతానికి మాత్రమే పరిమితం కాకుండా, ఉత్తర భారతంలో కూడా విశేషమైన క్రేజ్‌ను సంపాదించింది. ముఖ్యంగా పుష్ప 2: ది రూల్.. ట్రైలర్ లాంచ్‌ను బీహార్‌లో ఘనంగా నిర్వహించారు. అక్కడి ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తరువాత బాలీవుడ్‌తో పాటు బీహార్‌లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.

వివరాలు

భారీ స్థాయిలో సినిమా బిజినెస్..

ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న 'రాకా' సినిమాపై అక్కడి మార్కెట్‌లో భారీ ఆసక్తి నెలకొంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప సిరీస్ ద్వారా వచ్చిన ఇమేజ్ కారణంగా, ఈ సినిమా హక్కుల కోసం ఉత్తర భారత డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటి నుంచే పోటీపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతుందని భావిస్తున్నారు.

వివరాలు

రికార్డులు తిరగరాయనున్న రాకా

ముఖ్యంగా బీహార్‌లో 'రాకా' హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు సమాచారం. అక్కడి ప్రముఖ పంపిణీదారులు ఈ హక్కులను పొందేందుకు భారీ మొత్తాలను వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పలువురు డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో నిర్మాతలను సంప్రదించినట్టు తెలిసింది. దీంతో పుష్ప తరహాలోనే 'రాకా' కూడా ఉత్తర భారతంలో భారీ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. ఇక ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.

Advertisement