Vijay Deverakonda :విజయ్ దేవరకొండ ప్రాజెక్టులో బాలీవుడ్ బిగ్ బీ?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 'లైగర్' చిత్రం నిరాశపరచడంతో అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
పాన్ ఇండియా రేంజ్‌లో విజయవంతం కావాలని ఆశించిన కల అది కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన 'ఖుషీ' యావరేజ్ హిట్‌ను సాధించగా, 'ఫ్యామిలీ స్టార్' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
దీంతో ఈ సారి 'VD12' చిత్రంతో విజయ్ దేవరకొండ మాత్రం తప్పక హిట్ సాధించాలని నిర్ణయించుకున్నాడు.
'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'VD12' సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ ప్రారంభించనుంది.
Details
విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ షూట్
మొదటి షెడ్యూల్‌లో విజయ్ దేవరకొండ తన ఎంట్రీ సీన్స్‌ను షూట్ చేయనున్నాడు.
ఈ సినిమా కథ 1854-78 మధ్య కాలంలో జరిగే అంశంతో చాలా విభిన్నతలను చూపిస్తుందని సమాచారం. అలాగే విజయ్ దేవరకొండ లుక్ ఈ సినిమా కోసం కొత్తగా ఉన్నట్లు తెలిసింది.
ఇప్పటికే ఈ సినిమాలో ఒక కీలక అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో ఒక సీనియర్ హీరో నటిస్తున్నారని ఇటీవల టాక్ వినిపించింది.
తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇది నిజమే అయితే ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌కు మంచి విజయాన్ని అందుకోండం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.