Page Loader
Anchor Suma: గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. కారణమిదే..?
గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. కారణమిదే..?

Anchor Suma: గిన్నిస్ రికార్డును సాధించిన యాంకర్ సుమ తాతయ్య.. కారణమిదే..?

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2023
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ బుల్లితెర యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ రికార్డులుకెక్కారు. సుమ దాదాపుగా 20 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తూ ఉన్నారు. యాంకర్‌గా టీవీ షోలు, సినిమా ఈవెంట్స్, అప్పుడప్పుడు నటిగా సినిమాలు, యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఇలా అన్ని రకాలుగా సుమ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తోంది. తాజాగా ఆమె తాతయ్య గురించి ఆసక్తికర విషయాన్నీ ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా సుమ స్పందిస్తూ తన తాతయ్య సూపర్ హీరోనని, తనతో పాటు చాలామందికి ఎంతో స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

Details

73ఏళ్లుగా అడ్వకేట్ గా పనిచేస్తున్న సుమ తాతయ్య

సుమ అమ్మమ్మ గారి బ్రదర్ పి. బాలసుబ్రమణ్యన్ మీనన్ 98 ఏళ్ల వయస్సులో అరుదైన గౌరవాన్ని పొందాడు. ఆయన అడ్వకేట్. గత 73 ఏళ్లుగా అడ్వేకేట్‌గా పనిచేస్తున్నారు. ఇన్నాళ్ల లాంగ్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ఏకైక లాయర్‌గా మీనన్ రికార్డు సృష్టించాడు. దీంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు గమనించి, ఆయనకు అవార్డును అందించారు. ఈ విషయాన్ని సుమ తెలియజేస్తూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అవుతోంది.