LOADING...
Chiranjeevi Anil Ravipudi Movie: చిరంజీవితో సినిమాపై అనిల్‌ రావిపూడి ఆసక్తికర అప్‌డేట్‌
చిరంజీవితో సినిమాపై అనిల్‌ రావిపూడి ఆసక్తికర అప్‌డేట్‌

Chiranjeevi Anil Ravipudi Movie: చిరంజీవితో సినిమాపై అనిల్‌ రావిపూడి ఆసక్తికర అప్‌డేట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

చిరంజీవి హీరోగా తాను రూపొందించనున్న సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు. ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్‌ పెట్టి, అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ''స్క్రిప్ట్‌ వినిపించడం పూర్తయ్యింది. గ్రీన్ సిగ్నల్ లభించింది. చిరంజీవి గారికి నా కథలోని 'శంకర్ వరప్రసాద్' అనే పాత్రను పరిచయం చేశాను. ఆ పాత్ర ఆయనకు బాగా నచ్చింది. ఇక ఆలస్యం ఎందుకు? మంచి ముహూర్తంతో.. చిరు నవ్వులతో పండగ మొదలవుతోంది'' అని పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అనిల్‌ రావిపూడి చేసిన ట్వీట్ 

వివరాలు 

కీలక పాత్రలో అదితి రావు హైదరి

చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని అందరికీ తెలిసిందే. అనిల్ ఇచ్చిన ఈ అప్‌డేట్ ప్రకారం, కొత్త సినిమాలో చిరంజీవి 'శంకర్ వరప్రసాద్' పాత్రలో కనిపించనున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న సినిమా ఇదే. ఈ చిత్రం కామెడీ, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉండగా, ఓ కీలక పాత్ర కోసం అదితి రావు హైదరి పేరు పరిశీలనలో ఉందని సమాచారం. సంగీతాన్ని భీమ్స్ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్నారు.

వివరాలు 

శంకర్ పేరుతో చిరంజీవి సినిమాలు 

ఈ చిత్రానికి 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే, 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరో చిత్రాన్ని చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 150కి పైగా చిత్రాల్లో నటించిన చిరంజీవి, చాలా తక్కువ సినిమాల్లోనే 'శంకర్' పేరుతో ప్రేక్షకులను అలరించారు. 'లంకేశ్వరుడు'లో శివ శంకర్‌గా, 'ఇంద్ర'లో శంకర్ నారాయణగా, 'శంకర్‌దాదా ఎంబీబీఎస్', 'శంకర్‌దాదా జిందాబాద్' చిత్రాల్లో శంకర్ ప్రసాద్‌గా కనిపించారు.