Page Loader
Pawan Kalyan: మణిరత్నం, లోకేశ్ కనగరాజ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు
మణిరత్నం, లోకేశ్ కనగరాజ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు

Pawan Kalyan: మణిరత్నం, లోకేశ్ కనగరాజ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం ప్రశంసలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ఇప్పటికే అంగీకరించిన సినిమాలను పూర్తి చేస్తూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సత్తా చాటుతున్నారు. ఇటీవల ఆయన ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన కోలీవుడ్ దర్శకుడు, కమెడియన్ గురించి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమెడియన్ యోగిబాబు తనకు ఇష్టమని, ఆయన నటించిన ఓ సినిమాలో సర్పంచిగా చేసిన పాత్ర చాలా నచ్చిందని, అందులో ఆయన కామెడీ తనను బాగా నవ్వించిందని చెప్పాడు. అదే విధంగా మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమని, ఇక లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చిందన్నారు.

Details

పవన్ చేతిలో మూడు ప్రాజెక్టులు

అదే విధంగా మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమని, ఇక లోకేశ్ కనగరాజ్ ఫిల్మ్ మేకింగ్ నచ్చిందన్నారు. పవన్ తాజా వ్యాఖ్యలతో పవన్-లోకేశ్‌ కనగరాజ్‌ల కాంబినేషన్‌లో సినిమా రావాలని అభిమానులు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో నిమగ్నమై ఉండడంతో ఆయన గతంలో అంగీకరించిన ప్రాజెక్ట్‌లను మాత్రమే పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పవన్‌ ముగ్గురు దర్శకులతో పని చేస్తున్నారు. ఆయన చేతిలో 'ఓజీ', 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌', 'హరిహరవీరమల్లు' సినిమాలు ఉన్నాయి. 'హరిహరవీరమల్లు' పాన్‌ ఇండియా స్థాయి, చారిత్రక నేపథ్యం, భారీ బడ్జెట్‌ వంటి ప్రత్యేకతలతో తెరకెక్కుతోంది. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అయిన 'ఓజీ' కూడా శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇక హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌' సినిమా సెట్స్‌ మీదకు వచ్చింది.