AR Rahman: శుభవార్త చెప్పిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ అర్ రెహమాన్
ఈ వార్తాకథనం ఏంటి
ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం సాధారణంగా మారిపోయింది. బంధాలకు విలువ తగ్గిపోయిందా? లేక మనుషులే బంధాలను గౌరవించడం మానేశారా? అనేది ఒక అనుమానంగా మారింది.
చిన్నచిన్న గొడవలకు కూడా సమసిపోవడాన్ని జనాలు పూర్తిగా మానేశారు. దీనికి కొంతవరకు ఆర్థిక స్వావలంబన కూడా కారణం అనుకోవాలి.
ఎందుకంటే, ఈరోజుల్లో భర్తలతో సమానంగా భార్యలు కూడా సంపాదిస్తున్నాయి.
ఆ ఆర్థిక స్వాతంత్ర్యంతో "మనమే బ్రతికేయగలం" అనే నమ్మకంతో, విభేదాలను తగ్గించుకోవడం కంటే విడిపోవడమే మంచిదని భావిస్తున్నారు.
ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
వివరాలు
సెలబ్రిటీ విడాకులు
ప్రతిరోజూ ఏదో ఒక సెలబ్రిటీ విడాకుల గురించి ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది.
భాషతో సంబంధం లేకుండా అనేక మంది నటీనటుల జీవితాలు ఈ విధంగానే కొనసాగుతున్నాయి.
తెలుగులో నాగ చైతన్య-సమంత, దర్శకుడు క్రిష్, చిరంజీవి కుమార్తె శ్రీజ, పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్, నిహారిక లాంటి అనేక మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు.
తమిళంలో ధనుష్, కమల్ హాసన్ వంటి ప్రముఖులతో పాటు, బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి ప్రముఖ నటులు కూడా తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పి ఒంటరిగా జీవిస్తున్నారు.
ఇక తాజాగా, ఈ జాబితాలో స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా చేరారు.
వివరాలు
తిరిగి కలిసేందుకు ప్రయత్నిస్తున్న రెహమాన్ దంపతులు
ఇటీవల ఏఆర్ రెహమాన్ భార్య సైరా భాను, తన భర్త నుండి విడిపోతున్నట్లు ప్రకటించడం తెలిసిందే.
విడాకులపై ఆమె మాట్లాడుతూ, "మధ్యలో అంతులేని దూరం పెరిగిపోయింది, అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని తెలిపారు.
ఈ వార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే తాజా సమాచారం ప్రకారం, ఈ దంపతులు తిరిగి కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల సైరా భాను అనారోగ్యంతో బాధపడుతుండగా, ఏఆర్ రెహమాన్ ఆమెకు అండగా నిలిచాడట. ఈ విషయాన్ని సైరా భాను తరఫు న్యాయవాది వెల్లడించారు.
ఆమె అనారోగ్యంతో ఉన్న సమయంలో రెహమాన్ మద్దతుగా ఉండటంతో, ఇద్దరూ మళ్లీ కలిసిపోతారా? అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.