Page Loader
Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం
గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం

Telangana: గద్దర్ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు.. దిల్‌రాజుకు ప్రత్యేక స్థానం

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 23, 2024
03:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీ కళాకారులను ప్రభుత్వాలు సత్కరిస్తుండటం మనం చూస్తుంటాం. ప్రతిభ ఉన్న వాళ్లకు వార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తారు. ఈ వేడుకులను ఎంతో వైభవంగా నిర్వహించేవారు. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత వీటి గురించి పట్టించుకోవడం మానేశారు. 2014లో ఏపీ ప్రభుత్వం సినీ కళాకారులకు నంది అవార్డులు ప్రకటించింది. అయితే ఆ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించలేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఆ దిశగా ముందుకెళ్తుతోంది. గద్దర్ జయంతి సందర్భంగా.. గద్దర్ అవార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు

Details

వైస్ చైర్మన్ గా దిల్ రాజు

తాజాగా గద్దర్ అవార్డులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. గద్దర్ అవార్డుల విధివిధానాలు, నియమ నిబంధనలు వంటి అంశాలపై ప్రణాళిక రూపొందించనుంది. గద్దర్‌ అవార్డుల కమిటీకి చైర్మన్‌గా ప్రముఖ సినీ దర్శకుడు బి.నర్సింగరావు, వైస్ చైర్మన్‌గా ప్రముఖ సినీ నిర్మాత దిల్‌ రాజును నియమించింది. కమిటీ సలహారులుగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, అందెశ్రీ, తమ్మారెడ్డి భరద్వాజ, చంద్రబోస్‌, గుమ్మడి వెన్నెల, తనికెళ్ల భరణి, డి.సరేష్‌ బాబు, నారాయణమూర్తి, వందేమాతరం శ్రీనివాస్‌, సానా యాదిరెడ్డి, అల్లాణి శ్రీధర్‌, హరీష్‌ శంకర్‌, బలగం వేణు వంటి వారిని నియమించారు.