తదుపరి వార్తా కథనం

Bharateeyudu 2 : అంచనాలు తప్పడంతో నెలలోపే ఓటీటీలోకి భారతీయుడు-2..?
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jul 22, 2024
05:09 pm
ఈ వార్తాకథనం ఏంటి
లోకనాయకుడు కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు-2 చిత్రం భారీ అంచనాల మధ్య జులై 12న విడుదలైన విషయం తెలిసిందే.
1996లో విడుదలైన భారతీయుడు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
కట్ చేస్తే ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇప్పటికే చాలా థియోటర్లలో భారతీయుడు-2 సినిమాను తొలగించేశారు.
Details
త్వరలోనే అధికారిక ప్రకటన
ప్లాప్ దిశగా ఈ సినిమా సాగుతుండటంతో భారతీయుడు-2 చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు నెట్ ఫ్లిక్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మొదటగా ఈ సినిమా రిలీజైన రెండు నెలల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని నెట్ ఫ్లిక్స్ అగ్రిమెంట్ చేసుకుంది.
అయితే ఈ సినిమా రిజల్ట్ బెడిసికొట్టడంతో ఆగస్టు 2న ఈ మూవీని ఓటీటీలోకి తీసుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.