NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం
    తదుపరి వార్తా కథనం
    Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం
    Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట..

    Shilpa Shetty: మనీలాండరింగ్ కేసులో శిల్పాశెట్టి దంపతులకు ఊరట.. ఈడీ నోటీసులపై స్టే విధించిన న్యాయస్థానం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 11, 2024
    11:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా కు భారీ ఊరట లభించింది.

    ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలో ఉన్న ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలంటూ ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది.

    రాజ్ కుంద్రా సంస్థ 2017లో బిట్‌కాయిన్ల రూపంలో సుమారు రూ.6,600 కోట్లు వ‌సూల్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

    నెల‌కు 10 శాతం రిట‌ర్న్స్ ఇస్తామ‌ని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేసిన‌ట్లు కేసు ఫైల్ అయ్యింది.

    ఈ స్కీమ్‌లో మాస్టర్‌మైండ్ అయిన అమిత్ భ‌ర‌ద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా సుమారు 285 బిట్‌కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం.

    వివరాలు 

    శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్‌

    ఆ బిట్‌కాయిన్లతో ఉక్రెయిన్‌లో మైనింగ్ ఫార్మ్ తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

    ముంబైలోని జుహూలో శిల్పా శెట్టి పేరుపై ఉన్న ఒక బంగ్లా, పుణెలోని ఒక ఫ్లాట్‌, కుంద్రా పేరుపై ఉన్న ఈక్విటీ షేర్లను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ తెలిపింది.

    వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లు అని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.

    ఈడీ నోటీసులపై శిల్పా శెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈడీ నోటీసులపై స్టే విధించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బాలీవుడ్

    Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి  సినిమా
    Pankaj Udhas: భారత గజల్ ఐకాన్, దిగ్గజ సింగర్ పంకజ్ ఉధాస్ కన్నుమూత  గుజరాత్
    Taapsee Pannu: చిరకాల ప్రియుడిని చేసుకోనున్న తాప్సీ ..వచ్చే నెలలోనే ముహుర్తం..ఇంతకీ ఎవరంటే..  సినిమా
    Katrina Kaif Pregnant: కత్రినా కైఫ్ గర్భవతిగా ఉందా? వీడియో వైరల్!  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025