Boycott Laila : 'లైలా' సినిమాపై సోషల్ మీడియాలో బాయ్‌కాట్ ట్రెండ్.. కారణమిదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'లైలా' చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఒక వర్గానికి తీవ్ర అసంతృప్తిని కలిగించాయి.
విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా చిత్రం 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సాహు గార్లపాటి నిర్మిస్తున్నారు.
వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో **ఆదివారం ప్రీ-రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
ఈ వేడుకలో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Details
పృథ్వీ వ్యాఖ్యల కారణంగా వివాదం
సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ పృథ్వీ , ఇందులో నేను మేకల సత్తి పాత్రలో నటించాను. సినిమాలో ఓ సందర్భంలో 'ఇక్కడ ఎన్ని మేకలున్నాయి?' అని అడిగితే 150 అని చెప్పాను.
కానీ సినిమా చివరిలో లెక్కిస్తే మొత్తం 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయి. ఇది చాలా షాకింగ్ అని వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు వైసీపీపై పరోక్షంగా చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. కానీ 2024లో ఆ సంఖ్య 11కి తగ్గిపోయింది.
అందుకే పృథ్వీ ఈ వ్యాఖ్యలు వైసీపీపై చేసినట్లుగా ఉన్నాయని ఆ పార్టీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంతో #BoycottLaila హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.