బ్రో: ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అభిమానులను రిక్వెస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్
ఈ వార్తాకథనం ఏంటి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా, రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అభిమానులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు.
థియేటర్లలోకి సినిమా వచ్చేముందే అభిమానులకు ఒక విషయంలో రిక్వెస్ట్ చేసాడు సాయి ధరమ్ తేజ్.
బ్రో సినిమా విడుదల సందర్భంగా అభిమానులు చూపిస్తున్న ప్రేమకు తన ఆనందాన్ని తెలియజేస్తూనే, థియేటర్ల వద్ద బ్యానర్లు, కటౌట్స్ కట్టే సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరాడు.
కటౌట్లు, బ్యానర్లు కడుతున్న సమయంలో జరగరానిది ఏదైనా జరిగితే తాను భరించలేనని, తనకు అభిమానులే ప్రపంచమనీ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
Details
సంబరం కన్నా భద్రత ముఖ్యం
సినిమా విడుదల అవుతుందన్న ఉత్సాహంలో తొందరపాటుతో ఉండకుండా బ్యానర్లు కట్టే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, సెలెబ్రేషన్ కన్నా మీ సేఫ్టీ ముఖ్యమని సాయి ధరమ్ తేజ్ తెలియజేసారు.
తమిళంలో రూపొందిన వినోదయ సీతమ్ సినిమాకు రీమేక్ గా బ్రో సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దేవుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.
కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియన్ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని పి సముద్రఖని తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, బ్రో సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు సంగీతాన్ని థమన్ అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అభిమానులకు సాయి ధరమ్ తేజ్ ట్విట్
మీ ప్రేమకి చాలా చాలా థాంక్స్!!!
— Sai Dharam Tej (@IamSaiDharamTej) July 27, 2023
దయచేసి జాగ్రతగా ఉండండి.#BroTheAvatar pic.twitter.com/yVb1x9ujNQ