
ED: విజయ్ దేవరకొండ, రానాతో సహా పలువురు నటులపై కేసు నమోదు.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేసిన వ్యవహారంపై 29 మంది సినీ ప్రముఖులు, కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులు నమోదు చేసింది. సైబరాబాద్ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ను ఆధారంగా తీసుకుని ఈడీ ఇప్పుడు మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖి తదితరులున్నాయి. పలు బుల్లితెర నటులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో ఆరోపణలను ఎదుర్కొటున్నారు. తెలంగాణ పోలీసుల ప్రకారం, నిషేధిత బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసుల్లో ఇప్పటికే పోలీసులు విచారణ ప్రారంభించారన్నారు.
Details
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
వీరిపై బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ స్మృతి)318(4), 112 సెక్షన్లతోపాటు, రెడ్ విత్49, తెలంగాణ గేమింగ్ యాక్ట్‌లోని సెక్షన్లు 3, 3(ఎ), 4 ఐటీ చట్టం 2000, 2008లలోని 66డి సెక్షన్‌ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలున్న పేర్లలో రానా దగ్గుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైసీపీ ప్రతినిధి శ్యామల, టీవీ యాంకర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీయాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లు ఉన్నాయి.
Details
మరింత లోతుగా విచారణ చేయనున్న ఈడీ
చట్టవిరుద్ధ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచిస్తూ ఈ సెలబ్రిటీలు, సోషల్ మీడియా వ్యక్తులు ప్రజలకు విస్తృత ప్రచారం చేశారని, ఇందుకు భారీగానే పారితోషికం, కమీషన్లు పొందారని పోలీసులు తెలిపారు. ఈ యాప్‌ల వల్ల పలు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయని, కొంతమంది అప్పుల్లో కూరుకుని ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో, హైదరాబాద్ పోలీసులు దాఖలు చేసిన కేసును ఆధారంగా చేసుకుని ఈడీ మరింత లోతుగా విచారణ చేయనుంది.