Page Loader
భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్ దర్శనం
భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్

భోళాశంకర్ సెట్లో రామ్ చరణ్ దర్శనం

వ్రాసిన వారు Sriram Pranateja
Feb 09, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం ప్రపంచ స్టార్ గా మారిపోయారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ నటనకు హాలీవుడ్ జనాలు ఫిదా ఐపోయారు. అదీగాక ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం, ఇప్పుడు అదే పాట ఆస్కార్ నామినేషన్లో ఉండడంతో ఆర్ఆర్ఆర్ లోని నటించిన అందరికీ హాలీవుడ్ లెవెల్లో మంచి గుర్తింపు దక్కింది. అందుకే అందరూ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 15వ సినిమా మొదలయ్యింది. కానీ ఇంకా ముందుకు వెళ్ళడం లేదు. తాజాగా రామ్ చరణ్, చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సెట్లో కనిపించారు.

రామ్ చరణ్

స్టైలిష్ లుక్ లో కనిపించిన రామ్ చరణ్

వాల్తేరు వీరయ్య సక్సెస్ అవగానే భోళాశంకర్ మూవీ మొదలెట్టేసారు చిరంజీవి. హైదరాబాద్ లోని స్టూడియోలో కోల్ కతా సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇదే సెట్ లో ఒక పాట ఉందనీ, దానికోసం 200మంది డ్యాన్సర్లను తెప్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సెట్లో రామ్ చరణ్ దర్శనమిచ్చారు. అభిమానితో ఫోటో దిగారు. ప్రస్తుతం ఆ ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైలిష్ గా కనిపించాడు రామ్ చరణ్. భోళాశంకర్ సెట్ లో రామ్ చరణ్ కనిపించడంతో, శంకర్ తో సినిమా షూటింగ్ ఎప్పుడు ఉంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు వేస్తున్నారు. మరి రామ్ చరణ్ - శంకర్ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.