Dil Raju: తనిఖీలు సాధారణమే.. ఐటీ దాడులపై స్పందించిన దిల్ రాజు
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసం, ఆఫీసులపై ఐటీ అధికారులు నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడులపై శనివారం మీడియాతో మాట్లాడిన దిల్ రాజు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ సోదాలు జరుగటం సాధారణమని చెప్పారు. తన సంస్థల్లో 18 ఏళ్ల తరువాత ఈ విధమైన సోదాలు జరిగాయని తెలిపారు.
అకౌంట్స్ బుక్స్ అన్నీ క్లియర్‌గా ఉండటంతో ఐటీ అధికారులే ఆశ్చర్యపోయారని చెప్పారు.
ఐటీ అధికారులు తన ఇంటి, ఆఫీసుల వద్ద రూ.20 లక్షల లోపు నగదు మాత్రమే కనుగొన్నారన్నారు. దాడులు జరుగుతున్న సమయంలో ఎవరినీ బయటకు వెళ్లనివ్వలేదని ఆయన వివరించారు.
Details
అవాస్తవాలను ప్రచారం చేయొద్దు
తన తల్లి గుండెపోటు వచ్చినట్లు మీడియాలో వచ్చిన పుకార్లను కొట్టిపారేశారు.
తన తల్లి వయసు 81 ఏళ్ల అని, ఈ నెల 19న ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు.
ఐటీ దాడుల విషయంలో పుకార్లు ప్రచారం చేయకూడదని ఆయన సూచించారు.