Chiranjeevi: చిరు లీక్స్.. 'మెగా 158' టైటిల్ ఇదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ 'మెగా 158'పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలోనూ తన సినిమాల టైటిళ్లు, విశేషాలను సరదాగా లీక్ చేస్తూ వచ్చిన చిరంజీవి.. తాజాగా మరోసారి తన కొత్త సినిమా టైటిల్‌పై ఆసక్తికరమైన క్లూ ఇచ్చారు. వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' సినిమా విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి.. తన తాజా చిత్రానికి 'కదిరి' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో 'మెగా 158' టైటిల్ ఇదేనా అంటూ మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
వివరాలు
సినిమా టైటిల్‌తో పాటు ప్రత్యేక టీజర్..
చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమా టైటిల్‌తో పాటు ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కెవిఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
ప్రస్తుతం టైటిల్ టీజర్‌కు సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు.
ఈ సినిమాలో ప్రియమణి, అనస్వర రాజన్, నివేథా పేతురాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.