Page Loader
Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 
నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు

Chiranjeevi: నాలో స్ఫూర్తి నింపింది వారే.. అమితాబ్‌, కమల్‌ హాసన్‌ పై చిరంజీవి ప్రశంసలు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 01, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ సినీ నటుల్లో తనకు ప్రేరణనిచ్చిన వారిని గుర్తుచేస్తూ, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరు తనకు స్ఫూర్తిగా నిలిచారంటూ వివరించారు. ముంబయిలో నిర్వహించిన 'వేవ్స్‌' (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌) వేదికపై మాట్లాడుతూ,తన సినీ జీవితాన్ని గుర్తుచేసుకున్నారు. ''చిన్నప్పటినుంచి నేను డ్యాన్స్‌ చేస్తూ మా కుటుంబ సభ్యులు, స్నేహితులను మెప్పించేవాడిని. అలా నటనపై ఏర్పడిన ఆసక్తి నన్ను చెన్నైకి తీసుకెళ్లింది. నేను సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే సమయానికి చాలా మంది మహానుభావులు అప్పటికే అక్కడ ఉన్నారు. ఇప్పటికే పలువురు సూపర్‌స్టార్స్‌ ఉన్నారు కదా. ఇంకా అదనంగా నేనేం చేయగలను?అని అనుకునేవాడిని.. అయినా, అందరి దృష్టిని ఆకర్షించాలన్న లక్ష్యంతో ముందుకు సాగాను"అని చిరంజీవి అన్నారు.

వివరాలు 

 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌' 

1977లో నటనలో శిక్షణ తీసుకున్నాను. సహజంగా, మేకప్‌ లేకుండా నటించాలన్న కళను మిథున్‌ చక్రవర్తి నుంచి నేర్చుకున్నాను. యాక్షన్‌ సీన్లలో అమితాబ్‌ బచ్చన్‌ ప్రభావం నాపై ఉంది. అలాగే డ్యాన్స్‌ విషయంలో నా సీనియర్‌ కమల్‌ హాసన్‌ నాకు ఆదర్శంగా నిలిచారు. వారి సినిమాలను గమనిస్తూ, వారి నటనను అధ్యయనం చేస్తూ నన్ను నేను అభివృద్ధిపరుచుకున్నాను'' అని వెల్లడించారు. భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌' (వేవ్స్‌). గురువారం ప్రారంభమైన ఈ మహాసభ నాలుగు రోజుల పాటు జరగనుంది. వేవ్స్‌ సలహా బృందంలో చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్‌,మోహన్‌లాల్‌,అక్షయ్‌కుమార్‌,ఆమిర్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మాట్లాడుతున్న చిరంజీవి