LOADING...
Coolie Ott Release: ఓటీటీలో రజనీకాంత్‌ 'కూలీ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?
ఓటీటీలో రజనీకాంత్‌ 'కూలీ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

Coolie Ott Release: ఓటీటీలో రజనీకాంత్‌ 'కూలీ'.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్-థ్రిల్లర్ చిత్రం 'కూలీ' ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది. ప్రధానంగా రజనీ, నాగార్జున, సౌబిన్ షాహిర్ నటనతో పాటు, లోకేశ్‌ దర్శకత్వంలోని దృశ్యాలు ప్రేక్షకులను మెప్పించాయి. ఇలాంటి విజయం తర్వాత 'కూలీ' మూవీ ఓటీటీ వేదిక ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా సెప్టెంబర్ 11 నుండి స్ట్రీమింగ్‌ కోసం అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమెజాన్ ప్రైమ్ వీడియో చేసిన ట్వీట్