Page Loader
Sreeleela: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్.. శ్రీలీలతో స్క్రీన్ షేర్!
టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్.. శ్రీలీలతో స్క్రీన్ షేర్!

Sreeleela: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన డేవిడ్ వార్నర్.. శ్రీలీలతో స్క్రీన్ షేర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 04, 2025
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయంఅవసరం లేదు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడినప్పుడు తెలుగు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ, రీల్స్ చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. అలాగే అనేక కమర్షియల్ ప్రకటనల్లో కనిపించి అభిమానులతో మరింత చేరువయ్యాడు. ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తుతూ, తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్మాణ సంస్థ ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించింది. నిర్మాత రవిశంకర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ 'రాబిన్ హుడ్' సినిమాలో డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలిపారు.

Details

మార్చి 28న రాబిన్ హుడ్ రిలీజ్

దీంతో వార్నర్ పాత్ర ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగుతనానికి దగ్గరైన వార్నర్‌ను వెండితెరపై చూడటం అభిమానులకు ముచ్చటకరంగా మారనుంది. 'రాబిన్ హుడ్' చిత్రం మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, వార్నర్ తన పార్ట్‌ను రహస్యంగా పూర్తి చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2025 IPL కోసం డేవిడ్ వార్నర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. టీ20 ప్రపంచకప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆయన రిటైర్మెంట్ ప్రకటించాడు.