Page Loader
Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె 
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 08, 2024
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తల్లి అయ్యారు. ముంబయిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు.ఈ శుభవార్తతో ఆమె కుటుంబంలో ఆనందం నెలకొంది.దీపికా, రణ్‌వీర్ సింగ్ దంపతులకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. దీపికా,రణ్‌వీర్ తొలిసారి సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన'రామ్ లీలా'సినిమాలో కలిసి నటించారు. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు. సినిమా విషయాలకు వస్తే,రణ్‌వీర్ సింగ్ గతేడాది 'రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ'చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం ఆయన 'సింగమ్ అగైన్' చిత్రంలో నటిస్తున్నారు.మరోవైపు,దీపికా పదుకొణె ఇటీవల 'కల్కి 2898 AD' చిత్రంతో విజయాన్ని సాధించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బిడ్డతో  దీపికా పదుకొణె