NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌ 
    తదుపరి వార్తా కథనం
    Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌ 

    Devara:హాలీవుడ్‌ ఈవెంట్ లో'దేవర'..ఖుష్‌ అవుతోన్న ఫ్యాన్స్‌ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 13, 2024
    12:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

    తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్‌ నింపుతోంది'దేవర'ను హాలీవుడ్‌లో జరగనున్న ఈవెంట్‌లో ప్రదర్శించనున్నారు.

    కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెలెస్‌లో జరుగనున్న'బియాండ్ ఫెస్ట్'అనే అతిపెద్ద జానర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సినిమా ప్రదర్శించబడుతుంది.

    సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ ఈవెంట్ జరుగుతుంది. సెప్టెంబర్ 26 సాయంత్రం ఈజిప్టియన్ థియేటర్‌లో హాలీవుడ్ ప్రేక్షకులు,ప్రముఖులు ఈ సినిమాను వీక్షించనున్నారు.

    ఈ సందర్బంగా ఎన్టీఆర్ సెప్టెంబర్ 25న అమెరికా వెళ్లనున్నారని సినీవర్గాలు తెలిపాయి.ఈ వార్తతో అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.

    వివరాలు 

    టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌

    'దేవర' ట్రైలర్ విడుదల ఈవెంట్‌లో ఎన్టీఆర్ సినిమాపై అంచనాలను మరింత పెంచారు.

    ఆయన మాట్లాడుతూ, 'దేవర' విజువల్స్ అద్భుతంగా ఉంటాయని, చివరి 40 నిమిషాలు సినిమా ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.

    ఈ సినిమా ద్వారా జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి వస్తున్నారు.సైఫ్ అలీఖాన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

    యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ప్రీసేల్ బుకింగ్స్‌లో పలు రికార్డులు సృష్టించింది.

    నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా 'దేవర' నిలిచింది.

    ట్రైలర్ విడుదల కాకముందే ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'దేవర' రికార్డు నెలకొల్పింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా మంచి ప్రేక్షకాదరణను పొందింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దేవర
    జూనియర్ ఎన్టీఆర్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    దేవర

    Devara:'దేవర' షూటింగ్ సెట్‌లో ఎన్టీఆర్ ఫొటోలు వైరల్  జూనియర్ ఎన్టీఆర్
    Devara: ఫెస్టివల్ బ్రేక్ తర్వాత.. 'దేవర' షూటింగ్‌పై అప్టేట్ ఇచ్చిన మేకర్స్  జూనియర్ ఎన్టీఆర్
    Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్'లో శ్రీకాంత్'కు గాయం.. ఇంతకీ ఏం చెప్పారంటే  సినిమా
    Devara Glimpsc : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందంటే? ఎన్టీఆర్ 30

    జూనియర్ ఎన్టీఆర్

    Devara: జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు పండగే.. రెండు భాగాలుగా రానున్న 'దేవర' మూవీ  దేవర
    NTR31: ప్రశాంత్ నీల్‌,ఎన్టీఆర్ చిత్రంపై మేకర్స్ ప్రకటన   సినిమా
    అరుదైన ఘనత సాధించిన జూనియర్ ఎన్టీఆర్: ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్ లో చోటు దక్కించుకున్న హీరో  ఆస్కార్ అవార్డ్స్
    Devara: 'దేవర' నుంచి మరో అప్డేట్.. జూనియర్ ఎన్టీఆర్‌తో మరో స్టార్ హీరోయిన్..? దేవర
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025