Page Loader
Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్! 
చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!

Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

నటుడు ధనుష్‌, రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య గతేడాది విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. తమ చిన్నతనయుడు యాత్ర గ్రాడ్యుయేషన్‌ డేలో పాల్గొన్న సందర్భంగా ధనుష్‌, ఐశ్వర్య సంతోషంతో కలిసి కనిపించి, తనయుడిని ప్రేమగా ఆలింగనం చేశారు. ఈ ప్రత్యేక క్షణాన్ని ధనుష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పంచుకున్నారు. 'యాత్ర.. తల్లిదండ్రులుగా ఈరోజు మేమిద్దరం ఎంతో గర్వపడుతున్నాం'' అంటూ ధనుష్‌ క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ ఫొటోపై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తూ, 'చాలా రోజుల తర్వాత మీ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా ఆనందంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Details

మొదటి మైలురాయిని దాటాడు

అదే ఫొటోను రజనీకాంత్‌ ఎక్స్ వేదికగా కూడా షేర్‌ చేస్తూ, 'నా మనవడు జీవితంలో మొదటి మైలురాయి దాటాడు. కంగ్రాట్స్ యాత్ర కన్నా'' అంటూ అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. ధనుష్‌, ఐశ్వర్య 2004లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు. లింగ, యాత్ర. అయితే 2022 జనవరిలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారు. 2024 నవంబర్‌లో కోర్టు విడాకులను మంజూరు చేసింది. ప్రస్తుతం ధనుష్‌ దర్శకుడిగా, నటుడిగా సృజనాత్మకంగా బిజీగా ఉంటున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'కుబేర' చిత్రీకరణ దశలో ఉంది.