Page Loader
Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం
'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం

Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2025
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి "మిస్సైల్ మ్యాన్"గా పేరు గాంచిన, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందనున్న బయోపిక్ త్వరలో వెండితెరపైకి రానుంది. ఈ చిత్రంలో కలాం పాత్రను నటుడు ధనుష్ పోషించబోతున్నాడు. ఆయనకు జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు.

వివరాలు 

దర్శకుడెవరు? 

ఈ ప్రాజెక్ట్‌కు 'తానాజీ: ది అన్‌సంగ్ వారియర్','ఆదిపురుష్' వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కలాం' అనే టైటిల్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో డాక్టర్ కలాం సిల్హౌట్‌తో పాటు ఒక మిస్సైల్ చిత్రం చేర్చారు,ఇది కలాం భారతదేశ మిస్సైల్ అభివృద్ధికి చేసిన సేవలను సూచిస్తోంది. పోస్టర్‌పై ఇలా ఉంది: "రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఓ లెజెండ్ ప్రయాణం మొదలవుతుంది. భారత్ మిస్సైల్ మ్యాన్ వెండితెరపైకి రాబోతున్నారు. పెద్ద కలలు కనండి. మరింత ఎత్తుకు ఎదగండి." అంటూ ఈ చిత్రం గురించి ఓం రౌత్ సోషల్ మీడియా వేదికగా వివరించారు.

వివరాలు 

యువతకు ఆదర్శంగా నిలిచే కథ 

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నిజమైన నాయకుల కొరత ఉన్న సమయంలో, కలాం రాజకీయాలకు అతీతంగా జీవించారని దర్శకుడు ఓం రౌత్ తెలిపారు. "విద్య, నైపుణ్యం, స్వదేశీ ఆవిష్కరణలకు శక్తికి ఆయన ప్రతీక. ఆయన కథను తెరపై చూపించటం ఒక గొప్ప కళాత్మక బాధ్యత. ఇది నైతికంగా, సాంస్కృతికంగా ఎంతో బాధ్యతాయుతమైన విషయం. ప్రపంచ యువత, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ యువతకు ఇది ప్రేరణ ఇచ్చే కథ. ఇది నా జీవితంలో అత్యంత విలువైన ప్రాజెక్ట్. కలాం జీవితం ఒక పాఠం లాంటిది. ప్రపంచంలోని ఏ యువకుడైనా ఆయనతో కనెక్ట్ అవుతాడు" అంటూ ఓం రౌత్ చెప్పారు.

వివరాలు 

ప్రతిష్ఠాత్మక నిర్మాణం 

ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌ను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నిర్మాతలుగా అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. డాక్టర్ కలాం భారత అంతరిక్ష పరిశోధన మరియు రక్షణ రంగాలకు అందించిన అమూల్యమైన సేవలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నారు. కలాం పాత్ర కోసం ధనుష్ తన శరీరాన్ని మారుస్తూ శారీరకంగా ట్రాన్స్‌ఫర్‌ మేషన్‌ చేశారు. ప్రస్తుతానికి ఈ బయోపిక్‌లో ధనుష్ పాత్ర మాత్రమే వెల్లడించగా, ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఓం రౌత్ చేసిన ట్వీట్