
Dhanush : ధనుష్ 'ఇడ్లీ కడాయ్' రిలీజ్ డేట్ మారింది.. కొత్త తేదీ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్ వరుస సినిమాలకు కమిట్ అవుతూ కోలీవుడ్, బాలీవుడ్ అన్న తేడాలేకుండా శరవేగంగా పనులు కొనసాగిస్తున్నాడు.
యాక్టింగ్‌తో పాటు డైరెక్టింగ్ కూడా చేస్తూ ఎక్కువ సమయాన్ని సెట్స్‌లో గడిపేస్తున్నాడు.
ప్రస్తుతం తెలుగులో 'కుబేర', తమిళంలో 'ఇడ్లీ కడాయ్', బాలీవుడ్‌లో 'తేరీ ఇష్క్ మే' చిత్రాల్లో నటిస్తున్నాడు.
'రాయన్', 'నీక్' తర్వాత ధనుష్ దర్శకత్వం వహిస్తున్న కొత్త మూవీ 'ఇడ్లీ కడాయ్'. ఈ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు ధనుష్ ముందుగా ప్రకటించాడు.
అయితే అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్ర బృందం కూడా అదే రోజున సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
Details
ఇడ్లీ కడాయ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
దీంతో ఏప్రిల్ 10న కోలీవుడ్ బాక్సాఫీస్‌పై భారీ వార్ జరుగుతుందని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, 'ఇడ్లీ కడాయ్' రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ధనుష్ ప్రకటించాడు.
షూటింగ్ ఇంకా పూర్తికాలేదని, అనుకున్న టైమ్‌కు విడుదల చేయడం సాధ్యపడడం లేదని వెల్లడించాడు.
ఈ సినిమా 6 నెలలు పుష్ చేసి అక్టోబర్ 1కి మార్చేశాడు.
ధనుష్ వెనక్కి తగ్గడంతో అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలాంటి పోటీ లేకుండా ఏప్రిల్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
దీంతో ఈ సినిమా మరింత భారీ స్థాయిలో బిజినెస్ చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ తాజా నిర్ణయంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.