Page Loader
Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ హత్యకు బెదిరింపులు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడు అరెస్ట్‌ 
షారుక్‌ ఖాన్‌ హత్యకు బెదిరింపులు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడు అరెస్ట్‌

Shah Rukh Khan: షారుక్‌ ఖాన్‌ హత్యకు బెదిరింపులు.. ఛత్తీస్‌గఢ్‌లో నిందితుడు అరెస్ట్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల బాలీవుడ్‌ ప్రముఖ నటుడు షారుక్‌ ఖాన్‌ బెదిరింపులకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముంబై పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చెందిన ఫైజల్‌ ఖాన్‌గా గుర్తించారు. ఫైజల్‌ ఖాన్‌ అనే వ్యక్తి ముంబయి పోలీసులకు ఫోన్‌ చేసి, రూ.50 లక్షలు ఇవ్వకపోతే షారుక్‌ ఖాన్‌కు చంపుతామనిబెదిరించాడు. ఈ బెదిరింపుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్‌ కాల్‌ ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌ రాయపూర్‌లో ఈ నిందితుడి నంబర్‌ను గుర్తించి, మంగళవారం ఫైజల్‌ ఖాన్‌ను అరెస్ట్‌ చేశారు.

వివరాలు 

సల్మాన్‌ ఖాన్‌కు వరుసగా బెదిరింపులు

ఇలాంటి ఘటన గతంలో కూడా జరిగింది. గత అక్టోబరులో షారుక్‌ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు, నటుడు సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇటీవల వరుసగా బెదిరింపులకు గురవుతున్నారు. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్ పేరుతో వచ్చిన ఓ పాటపై సల్మాన్‌ను బెదిరిస్తున్నారు. ఈ పాట రచయితను ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, తదుపరి పాటలు రాయలేనివిధంగా చేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.