
Geethanjali Malli Vachindi: స్మశాన వాటికలో 'గీతాంజలి మళ్లీ వచ్చింది' టీజర్
ఈ వార్తాకథనం ఏంటి
అంజలి లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం'గీతాంజలి మళ్ళీ వచ్చింది'.ఈ సినిమా నిర్మాతలు టీజర్ ఆవిష్కరణ కోసం సరికొత్తగా బేగంపేట్ శ్మశానవాటికలో టీజర్ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
అంజలి ప్రధాన పాత్రలో,నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ను ఫిబ్రవరి 24న సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట శ్మశానవాటికలో విడుదల చేయనున్నారు.
ఈ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గీతాంజలి మళ్లీ వచ్చింది అంజలి 50వ సినిమా. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి,సత్యం రాజేష్,సత్య, షకలక శంకర్,అలీ,బ్రహ్మాజీ,రవిశంకర్,రాహుల్ మాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించిన ఈ సినిమాను కోన వెంకట్,MVV సినిమాస్ నిర్మించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మేకర్స్ చేసిన ట్వీట్
ఈ శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేట్ స్మశాన వాటికలో ⚰️ గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ లాంచ్ 🥶👻
— Kona Film Corporation (@KonaFilmCorp) February 22, 2024
Brace Yourselves for a Never Before Event In Telugu Cinema ❄️🔥#GeethanjaliMalliVachindhi #Anjali50 @yoursanjali @konavenkat99 @MP_MvvOfficial #GV #ShivaTurlapati @Plakkaraju pic.twitter.com/deM4OUsiXP