Naga Chaitanya: హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య..ప్రత్యేకమైన 7 సినిమాలేంటో తెలుసా
అక్కినేని నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరరావు మనవడు, కింగ్ నాగ్ తనయుడు. ఈనెల 23న శుక్రవారం అక్కినేని వారసుడి పుట్టిన రోజు. మొత్తంగా 23 సినిమాలు చేసిన నాగ చైతన్య కెరీర్‌లో 7 సినిమాలు మాత్రం చిరస్మరణీయంగా నిలిచాయి. తండ్రి నాగార్జున మాదిరే తన పని తాను చేసుకుపోతుంటాడు. కామ్'గా సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు అలా మాస్ సినిమాలతో అక్కినేని ఫ్యాన్స్'కు పూనకాలు తెస్తుంటాడు. 2009లో జోష్ సినిమాతో 23 ఏళ్ల వయసులో హీరోగా టాలీవుడ్'లోకి వచ్చాడు. 2017లో తోటి నటీమణి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ 2021లో ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
ఈ 7 సినిమాలు నాగ చైతన్యకు ప్రత్యేకం
1. జోష్ : ఈ సినిమా ఫ్లాప్ అయినా చైతూ నటనకు మార్కులు పడ్డాయి. 2. ఏమాయ చేసావే : ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు సమంతతో పరిచయం కూడా ఈ సినిమా నుంచే. 3. 100% లవ్ : 2011లో విడుదలైన ఈ సినిమా చైతూకు మార్కెట్ తెచ్చిపెట్టింది. 4. మనం : అక్కినేని వంశం కలిసి నటించిన ఆఖరి సినిమా. 5. ప్రేమమ్ : 2016లో విడుదలైన ఈ చిత్రం 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 6. మజిలి : పెళ్లి తర్వాత సమంతతో కలిసి నటించిన ఈ సినిమా 40 కోట్ల షేర్ సాధించింది. 7. లవ్ స్టోరి : ఈ సినిమా సుమారు 35 కోట్లు షేర్ వసూలు చేసింది.