
Deadpool and Wolverine Collections : భారీగా తగ్గిన 'డెడ్‌పూల్ & వుల్వరైన్' కలెక్షన్స్
ఈ వార్తాకథనం ఏంటి
మార్వెల్ మూవీ డెడ్‌పూల్ వోల్వెరైన్ మూవీ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తొలి మూడు రోజుల్లోనే 3,500 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులను క్రియేట్ చేసింది.
మొదటి వారంలోనూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో రికార్డులను సృష్టించింది.
ఇక అమెరికా, కెనడా, ఇండియాలోనూ తొలి మూడు రోజులు కలెక్షన్ల వర్షం కురిపించాయి.
అయితే సోమవారం ఈ కలెక్షన్సులు భారీగా తగ్గిపోయాయి.
ఇండియాలో మొదటి రోజుల్లోనూ రూ.66 కోట్లను ఈ మూవీ రాబట్టింది.
Details
ఇండియాలో సగానికి సగం పడిపోయిన కలెక్షన్లు
సోమవారం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 7 కోట్లను మాత్రమే వసూలు చేసింది.
మూడో రోజైన ఆదివారం మాత్రం రూ.22.3 కోట్లు కలెక్షన్లు సాధించగా, నాలుగో రోజు సగానికి సగం కలెక్షన్లు పడిపోవడం గమనార్హం.
మొత్తంగా ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.73.65 కోట్లను రాబట్టింది.
ఫస్ట్ వీకెండ్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ.211.4 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం.