LOADING...
రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమాలో హాలీవుడ్ స్టార్, విజయేంద్ర ప్రసాద్ వెల్లడి
హాలీవుడ్ స్టార్ ని తీసుకునే అవకాశం ఉందని విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

రాజమౌళి, మహేష్ బాబు కాంబో సినిమాలో హాలీవుడ్ స్టార్, విజయేంద్ర ప్రసాద్ వెల్లడి

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 24, 2023
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉంటుందని తెలిసినప్పటి నుండి ఆ సినిమా గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఒకానొక ఇంటర్వ్యూలో మాట్లాడిన రచయిత విజయేంద్ర ప్రసాద్, ఆఫ్రికమ్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందే ఈ సినిమాలో హాలీవుడ్ యాక్టర్స్ నటించే అవకాశం ఉందని అన్నారు.

Details

హాలీవుడ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందాలు 

గతంలో హాలీవుడ్ ఏజెన్సీలతో రాజమౌళి ఒప్పందాలు కుదుర్చుకున్నాడని వార్తలు వచ్చిన సమయంలో క్రిస్ హెమ్స్ వర్త్ పేరు బయటకు వచ్చింది. రాజమౌళి తర్వాతి సినిమాలో క్రిస్ హెమ్స్ వర్త్ నటించే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడు స్వయంగా చిత్ర రచయిత విజయేంద్ర ప్రసాద్, హాలీవుడ్ నటీనటులు ఉండే అవకాశం ఉందని చెప్పడంతో క్రిస్ హెమ్స్ వర్త్ ని తీసుకుంటున్నారని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయమై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఇంకా సినిమాను అధికారికంగా ప్రారంభించలేదు కూడా. ప్రస్తుతం మహేష్ అభిమానులు అందరూ ఈ సినిమా ప్రారంభం కోసమే ఎదురుచూస్తున్నారు.