
OTT: ఒక్కో సినిమాకు వందల కోట్లు.. తమిళ చిత్రాల ఓటీటీ హక్కులకు సెన్సేషనల్ డీల్!
ఈ వార్తాకథనం ఏంటి
కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా 'థగ్ లైఫ్' కోలీవుడ్ సినీ వర్గాల్లో భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ అంచనాలను మరింత పెంచింది.
జూన్ 5న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఓటిటి హక్కులు భారీ స్థాయిలో విక్రయమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ. 150 కోట్లకు ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు కమల్ నటించిన సినిమాల్లో ఇంత పెద్ద డీల్ ఏదీ జరగలేదు.
సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' విజయంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చినప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కానీ, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తోన్న 'కూలీ' రజనీకి మళ్లీ సక్సెస్‌ను అందించబోతుందన్న నమ్మకం ఉంది.
Details
తమిళ సినిమాలకు విపరీతమైన క్రేజ్
భారీ స్టార్ కాస్ట్, అద్భుతమైన క్రేజ్ కారణంగా ఈ సినిమాపై విపరీతమైన బజ్ నెలకొంది.
సన్ పిక్చర్స్ ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకొని రూ. 110 నుంచి రూ. 120 కోట్ల మధ్య ఓటీటీ రైట్స్ విక్రయించినట్లు టాక్.
అలాగే 'జైలర్ 2' హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకునే అవకాశముంది.
ఇవి మాత్రమే కాదు, ఈ ఏడాదిలో విడుదలకు సిద్ధంగా ఉన్న సూర్య 45, కార్తీ 'సర్దార్ 2', వా వాతియార్, ధనుష్ 'ఇడ్లీ కడాయ్', రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ సేతుపతి 'ఏస్, ట్రైన్', అలాగే ప్రదీప్ రంగనాథ్ 'లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ' వంటి చిత్రాలు భారీ ధరలకు ఓటీటీ హక్కులు అమ్ముకునే అవకాశాలు ఉన్నాయి.