
COOLIE: నాగార్జునతో గడిపిన రోజులు మర్చిపోలేను.. రజినీకాంత్ ఎమోషనల్!
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'కూలీ' (Coolie) ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల కానుంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటసింహం నాగార్జున ప్రధాన విలన్ పాత్రలో కనిపించనుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతిహాసన్ సహా పలు భాషల నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియో సందేశం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ వీడియోలో రజినీకాంత్ మాట్లాడుతూ - తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయింది.
Details
స్పెషల్ గెస్ట్ గా అమీర్ ఖాన్
తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఎంత గొప్ప డైరెక్టర్‌యో, తమిళ్‌లో మా లోకేష్ కనగరాజ్ కూడా అలాంటివారు. ఆయన చేసిన ప్రతి సినిమా హిట్. కూలీ సినిమా కూడా అలాంటిదే. ఈ సినిమాలో పలు ఇండస్ట్రీల నుంచి స్టార్స్ కలిసి నటిస్తున్నారు. అమీర్ ఖాన్ స్పెషల్ గెస్ట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి విన్నప్పుడు.. అది చాలా పవర్‌ఫుల్ రోల్. నేను కూడా చేయాలనుకున్నా. కానీ లోకేష్ వచ్చి నాగార్జున గారు చేస్తున్నారని చెప్పారు. విన్న వెంటనే షాక్ అయ్యానని చెప్పారు. 33 ఏళ్ల క్రితం నాగార్జునతో ఓ సినిమా చేశా. అప్పట్లో ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడూ అలాగే ఉన్నారు.
Details
ఫిట్‌నెస్ కోసం వర్కౌట్స్, స్విమ్మింగ్ చేస్తాను
అంత గ్లామర్, అంత ఫిట్‌నెస్ ఎలా సాధ్యమైందని అడిగితే.. 'వర్కౌట్స్ చేస్తాను, స్విమ్మింగ్ చేస్తాను. మా నాన్నగారి జీన్స్, అలాగే ఎమోషనల్‌గా ఏదీ మనసులో పెట్టుకోనని చెప్పారు. ఇదే ఆయన సీక్రెట్!' అని రజినీకాంత్ అన్నారు. నాగార్జునతో గడిపిన రోజులను నేను జీవితాంతం మర్చిపోలేను. ఆయన ఇచ్చిన సలహాలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఈ సినిమాలో నాగ్ విలన్‌గా నటించిన తీరు అదిరిపోయింది. నేను కూడా ఇంత బాగా చేయలేనేమో అనిపించింది. బాషా సినిమాలో ఆంటోనీ పాత్ర ఎలా ఉంటుందో.. నాగ్ పాత్ర కూడా అలాంటి ఇంపాక్ట్ ఉంటుందని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.
Details
ప్రేక్షకుల ఆదరణే ముఖ్యం
ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సినిమా బాగా ఆడాలి. కానీ మేము చేశాం కదా అని మిగిలిపోదు. మీరే ఆడించాలి. ప్రేక్షకుల ఆదరణే మా విజయానికి ఆధారమని ముగించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, రజినీ, నాగ్‌ల కాంబినేషన్ మరోసారి మెరుపులు మెరిపించనుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.