HBD Varun Tej: ఆసక్తికరంగా వరుణ్ తేజ్ 'మట్కా' గ్లింప్స్..పీరియాడిక్ థ్రిల్లర్‌లో అదిరిపోయే లుక్ లో వరుణ్ తేజ్
నటి లావణ్య త్రిపాఠితో పెళ్లి తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన మొదటి పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. గాండీవధారి అర్జునలో చివరిగా కనిపించినవరుణ్,తన రాబోయే చిత్రం ఆపరేషన్ వాలెంటైన్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు, వరుణ్ తేజ్ పలాస 1978 సినిమాని డైరెక్ట్ చేసిన కరుణకుమార్ తో "మట్కా"అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. వరుణ్ తేజ్ పుట్టినరోజును పురస్కరించుకుని, మేకర్స్ ఓపెనింగ్ బ్రాకెట్ అనే పేరు తో గ్లింప్స్ ను విడుదల చేశారు.
మట్కా జూదం ఆట చుట్టూ కేంద్రీకృతమై ఉన్న పిరియాడికల్ ఫిల్మ్
ఓ గ్యాంబ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం వరుణ్ తేజ్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ అయ్యింది. ఇందులో వరుణ్ తేజ్ అయితే మరోసారి తనలోని వెర్సటాల్టీ చూపించబోతున్నాడు అనిపిస్తుంది. గ్లింప్స్ లో సినిమాలోని ఇతర పాత్రలను పరిచయం చేశారు. చిత్రం కథాంశం గురించి పెద్దగా వెల్లడించనప్పటికీ, మట్కా అనే జూదం ఆట చుట్టూ కేంద్రీకృతమై ఉన్న పిరియాడికల్ ఫిల్మ్ అని అర్థమవుతోంది.