
Tamil Film Industry : తమిళ సినిమా భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? రజినీ, విజయ్ తర్వాత ఎవరు స్టార్?
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఈ మధ్య స్టార్ హీరోలు కరువయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. వంద కోట్లు దాటే కలెక్షన్స్ తెచ్చే హీరోలు, కేవలం తమ ఇమేజ్ ఆధారంగా థియేటర్లకు జనాన్ని రప్పించే హీరోలు తగ్గిపోతున్నారు. పరిశ్రమలో మంచి సినిమాలు వచ్చినా, మాస్ కమర్షియల్ సినిమాలు లేకుంటే ఆర్థికంగా నష్టమే. అందుకే స్టార్ హీరోల అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగులో చిరంజీవి నుంచి విజయ్ దేవరకొండ వరకు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్, కోట్ల కలెక్షన్స్ తెప్పించే హీరోలు ఉన్నారు. ఫ్లాప్ సినిమాలు అయినా వందల కోట్ల బిజినెస్ సాధిస్తున్నాయి.కానీ తమిళ్‌లో అలాంటి స్టార్‌డమ్ కలిగిన హీరోలు ఇద్దరుముగ్గురే ఉన్నారు. వాళ్లు కూడా రిటైర్ అయ్యే దశకు చేరుకోవడంతో "తర్వాత ఎవరు?" అనే చర్చ మొదలైంది.
Details
విజయ్ - రజినీకాంత్
ప్రస్తుతం తమిళ్‌లో ప్రతి సినిమాకు వంద కోట్ల మార్క్ దాటించే హీరోలు విజయ్, రజనీకాంత్ మాత్రమే. ఫ్లాప్ అయినా వీరి సినిమాలు భారీ ఓపెనింగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తాయి. కానీ విజయ్ త్వరలో పొలిటిక్స్‌లో బిజీ కానున్నారు. రజినీకాంత్ వయసు పెరగడంతో మహా అయితే ఇంకో నాలుగైదు సినిమాలు మాత్రమే చేయగలరని అంచనా. అజిత్ వీరి తర్వాత ఓపెనింగ్స్ సాధించే హీరో అజిత్. కానీ ఆయన ఎక్కువగా సినిమాలపై దృష్టి పెట్టకుండా కార్, బైక్ రేసింగ్‌లాంటి హాబీలతో బిజీ అవుతున్నారు. సంవత్సరానికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌లా అజిత్ కూడా ఫోకస్ చేస్తే కమర్షియల్‌గా పెద్ద స్టార్ అవ్వొచ్చు కానీ ఆ దిశగా వెళ్లడం లేదు.
Details
ధనుష్
ధనుష్‌కి హిట్ సినిమాలు ఉన్నా కలెక్షన్ల పరంగా పెద్దగా బాక్సాఫీస్ శక్తి చూపడం లేదు. వంద కోట్ల మార్క్ దాటిన సినిమాలు చేతి వేళ్లపై లెక్కపెట్టేంత మాత్రమే. నటనలో ప్రశంసలు, అవార్డులు సంపాదిస్తున్నా, ఫ్యాన్స్‌తో దూరంగా ఉండటం, ప్రమోషన్లలో పాల్గొనకపోవడం వల్ల కమర్షియల్ స్టార్ గా మారడం కష్టమవుతోంది. మధ్యలో డైరెక్షన్‌తో కూడా బిజీ అవ్వడం ఆయన స్టార్‌డమ్‌కి దెబ్బ కొడుతోంది. సూర్య - విక్రమ్ ఈ ఇద్దరు హీరోలు ఎప్పటినుంచో ప్రయోగాల మీదే దృష్టి పెడుతున్నారు. మంచి నటన ఉన్నా, సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఫలితంగా భారీ ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. వీరిని ఇక కమర్షియల్ హీరోలుగా చూడటం మానేశారు.
Details
కార్తీ
కార్తీకి క్లాస్, థ్రిల్లర్ సినిమాలు బాగా వర్క్ అవుతున్నా, మాస్ కమర్షియల్ సినిమాలు పెద్దగా నడవడం లేదు. మంచి పేరు తెచ్చుకున్నా, భారీ ఓపెనింగ్స్ మాత్రం రానివ్వడం లేదు. ఆయన స్థాయి మన వెంకటేష్ స్థాయిలోనే ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కమల్ హాసన్ కమల్ హాసన్ అసలు మొదటి నుంచే కమర్షియల్ హీరోగా కాకుండా నటన ఆధారిత సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చారు. రజినీకాంత్‌లా మాస్ అపీల్ తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు పొలిటిక్స్‌లో కూడా యాక్టివ్ అవ్వడంతో సినిమాలపై దృష్టి తగ్గిపోయింది.
Details
కొత్త ఆశ - శివ కార్తికేయన్
ప్రస్తుతం "నెక్ట్స్ సూపర్ స్టార్" అవ్వగల అవకాశం శివ కార్తికేయన్ దగ్గరే ఉంది. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సినిమాలు చేసి, మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. సరైన దిశలో ఫోకస్ చేస్తే భవిష్యత్తులో తమిళ్ సినీ పరిశ్రమను మాస్ కమర్షియల్‌గా నడిపించగలడు అని టాక్ వినిపిస్తోంది.
Details
విజయ్ సేతుపతి - ఇతర హీరోలు
విజయ్ సేతుపతికి కూడా స్టార్‌డమ్ అవ్వగల స్కోప్ ఉంది. కానీ ఆయన విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కూడా బిజీ అవ్వడంతో హీరోగా ఫోకస్ తగ్గించాడు. విశాల్, శింబు, జయం రవి, ఆర్య, జీవా, అరుణ్ విజయ్, అధర్వ మురళి, విజయ్ ఆంటోనీ లాంటి హీరోలు మాత్రం టైర్ 2 స్థాయిలో ఉంటూ అప్పుడప్పుడు హిట్స్ ఇస్తున్నారు. కానీ వీరిని స్టార్ కమర్షియల్ హీరోలుగా చూడటం కష్టమే. తుది మాట ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీ విజయ్, రజినీకాంత్ మీదే ఆధారపడి ఉంది. వీరు తప్పుకుంటే పెద్ద కమర్షియల్ స్టార్ ఎవరు అవుతారు? ఎవరు భారీ ఓపెనింగ్స్ తెప్పించి పరిశ్రమను నిలబెడతారు? అనే చర్చ సీరియస్‌గా నడుస్తోంది.