
JioStar:సబ్‌స్కైబర్ల సంఖ్యను పెంచుకోవడం కోసం.. యూట్యూబ్ నుంచి కంటెంట్ తొలగించనున్న జియోస్టార్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రసిద్ధ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioStar) తన వినియోగదారులను పెంచుకునేందుకు ఉత్సాహంగా పనిచేస్తోంది.
సబ్‌స్క్రైబర్ల సంఖ్య తగ్గకుండా అనేక వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా, ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
త్వరలోనే యూట్యూబ్ వేదిక నుంచి తమ కంటెంట్‌ను పూర్తిగా తొలగించేందుకు సిద్ధమవుతోందని వార్తలు వస్తున్నాయి.
సంబంధిత వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించినట్లు ప్రముఖ ఆంగ్ల వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.
సబ్‌స్క్రైబర్ల పెరుగుదల కోసం ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఉచితంగా అందించిన వినోదాత్మక కంటెంట్‌ను తొలగించాలని జియోస్టార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మే 1 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని సంస్థ ఆలోచనలో ఉందని సమాచారం.
వివరాలు
విలీనం అనంతరం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్
అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇది జియో సినిమా & డిస్నీ+ హాట్‌స్టార్ విలీనానికి పిదప,ఈ కొత్త జాయింట్ వెంచర్ చేపట్టనున్న రెండో కీలక చర్య కానుంది.
రిలయన్స్ సంస్థకు చెందిన వయాకామ్ 18 మరియు స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం తర్వాత జియోస్టార్ పేరిట ఓటీటీ సేవలను ప్రారంభించాయి.
ఈ విలీనంతో జియో సినిమా & డిస్నీ+ హాట్‌స్టార్ ఒకే వేదికపైకి చేరాయి. ఇప్పుడు "జియో హాట్‌స్టార్ (JioHotstar)" పేరుతో ఈ సంయుక్త సేవలను అందిస్తున్నాయి.
విలీనానికి ముందు రెండేళ్ల పాటు క్రీడలతో సహా ప్రీమియం కంటెంట్‌ను హాట్‌స్టార్ ఉచితంగా అందించేది.
కానీ, విలీనానికి అనంతరం ఈ సదుపాయాన్ని తొలగించి, సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.