LOADING...
Kalki2898AD : 'కల్కి 2' షూటింగ్ ప్రారంభం… ప్రభాస్ సెట్స్‌లోకి ఎప్పుడు చేరనున్నాడు?
'కల్కి 2' షూటింగ్ ప్రారంభం… ప్రభాస్ సెట్స్‌లోకి ఎప్పుడు చేరనున్నాడు?

Kalki2898AD : 'కల్కి 2' షూటింగ్ ప్రారంభం… ప్రభాస్ సెట్స్‌లోకి ఎప్పుడు చేరనున్నాడు?

వ్రాసిన వారు Moogati Shabari
May 01, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అనేక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఆయన చేస్తున్న సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తున్నది 'కల్కి 2898 AD' సీక్వెల్. ఈ చిత్రాన్ని దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త సమాచారం బయటకు వచ్చింది. ఈ రోజు నుంచి తాజా షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుందని, అందులో ప్రభాస్ కూడా పాల్గొంటాడని తెలుస్తోంది.

వివరాలు

కొత్త లుక్‌లో ప్రభాస్..

ఇటీవల కొంతకాలంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ సెట్లో 'కల్కి 2' చిత్రీకరణ కొనసాగుతోంది. ఈ కొత్త షెడ్యూల్‌లో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రభాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. మొదటి భాగంలో ప్రభాస్ కర్ణ, భైరవ అనే రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఈ సీక్వెల్‌లో ఆయన పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి మరింత ఆశ్చర్యపరచనున్నాడని వినిపిస్తోంది. మొత్తం మీద ఈ భాగంలో ప్రభాస్ పాత్ర మరింత శక్తివంతంగా ఉండబోతోంది.

వివరాలు

కల్కి2పై భారీ అంచనాలు..

ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో పలువురు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించనున్నారు. కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో నెగటివ్ షేడ్స్‌తో భిన్నంగా కనిపించనున్నారు. వీరిద్దరితో పాటు ప్రభాస్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, అద్భుతమైన సెట్స్‌తో రూపొందుతున్న 'కల్కి 2'పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement