Page Loader
Kamal Haasan meets Rajinikanth : ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్.. శుభవార్తతో రజనీకాంత్ నివాసానికి!
ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్.. శుభవార్తతో రజనీకాంత్ నివాసానికి!

Kamal Haasan meets Rajinikanth : ఎంపీగా ఎన్నికైన కమల్ హాసన్.. శుభవార్తతో రజనీకాంత్ నివాసానికి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 16, 2025
01:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ సినీ దిగ్గజాలు కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే వేదికపై కలుసుకున్నారు. కమల్ హాసన్ ఇటీవలే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా, ఈ శుభవార్తను తన సన్నిహితుడైన రజనీకాంత్‌తో పంచుకోవడానికి ఆయన నివాసాన్ని సందర్శించారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రకటించారు. రాజ్యసభ ఎంపీగా నా కొత్త ప్రయాణాన్ని నా స్నేహితుడు రజనీకాంత్‌కు తెలియజేశాను. ఆయనతో ఈ ఆనందాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందని కమల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలని ఆయన షేర్ చేశారు. అందులో ఒక ఫోటోలో కమల్ హాసన్ తన ఎంపీ నామినేషన్ ఆర్డర్‌ను రజనీకి చూపించగా, మరొక ఫోటోలో ఇద్దరూ హృదయపూర్వకంగా కౌగిలించుకున్నారు.

Details

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీకి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే కమల్ హాసన్‌ను డీఎంకే రాజ్యసభకు నామినేట్ చేసి, ఏకగ్రీవంగా ఎంపీగా ఎన్నిక చేయించింది. సినిమా పరంగా చూస్తే.. కమల్ హాసన్ ఇటీవలి కాలంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన 'థగ్ లైఫ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కూలీ' సినిమాలో నటిస్తుండగా, ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కాబోతోంది.