Page Loader
Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌!
'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌!

Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 02, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

సినీనటుడు కమల్‌ హాసన్‌, ఇటీవల కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్రమైన దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల ప్రభావంతో ఆయన నటించిన కొత్త సినిమా 'థగ్ లైఫ్' (Thug Life) కర్ణాటకలో విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో, కమల్ హాసన్ తన సినిమా రాష్ట్రంలో విడుదలకు అనుమతించాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Details

కోర్టులో పెట్టిన ప్రధానమైన అభ్యర్థనలు

'థగ్ లైఫ్' సినిమాను కర్ణాటకలో విడుదల చేయడానికి అడ్డంకులు లేకుండా చూడాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. సినిమా ప్రదర్శనకు తగిన భద్రతను కల్పించేలా డీజీపీ, సిటీ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. చలనచిత్ర వాణిజ్య విభాగం సహా సంబంధిత అధికారులందరికీ విజ్ఞప్తులు పంపించాలని అభ్యర్థించారు.

Details

వివాదం ఎలా ప్రారంభమైంది?

'థగ్ లైఫ్' ప్రీ-రిలోజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అన్న వ్యాఖ్యలు చేశారు. ఇది కన్నడ అభిమానులు, రాజకీయ పార్టీలు, ఫిల్మ్ ఛాంబర్‌కు తీవ్రంగా బాధ కలిగించింది. దీనిపై స్పందించిన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) మే 30 లోపు కమల్ క్షమాపణ చెప్పకపోతే సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరించింది. తన వ్యాఖ్యలు ప్రేమతో చేసినవేనన్నారు. తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతానని, తాను చెప్పింది చరిత్రకారుల నుండి వినిన విషయమేనని స్పష్టం చేశారు. జూన్ 5న 'థగ్ లైఫ్' విడుదల కావాల్సి ఉండటంతో న్యాయ పరిరక్షణ కోసం కమల్ హాసన్ హైకోర్టును ఆశ్రయించారు.