Srisrinivasan Died: నటుడు కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం...మామగారు శ్రీశ్రీనివాసన్ కన్నుమూత
నటుడు కమల్ హాసన్(Kamal Hasan)ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కమల్ హాసన్ కు మావయ్య అయ్యే పీపుల్స్ జస్టిస్ సెంటర్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసన్(Sri Sirnivasan)ఆరుయుర్ సోమవారం కొడైకెనాల్(Kodaikenal)లో కన్నుమూశారు. శ్రీనివాసన్ కు 92 ఏళ్లు. పరమకుడి (Paramakudi) ప్రాంతానికి చెందిన శ్రీ శ్రీనివాసన్ గతంలో ఎయిర్ ఫోర్స్ (Air Force) లో పనిచేశారు. ఉద్యోగం అనంతరం కొడైకెనాల్ లో ఉంటున్నారు. ఆయన పార్థీవ దేహాన్ని చెన్నై(Chennai)లోని ఆళ్వార్ పేటలో ఉన్న ప్రజా న్యాయ కేంద్రం హెడ్ క్వార్టర్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. మంగళవారం ఆయన భౌతిక కాయానికి బీసెంట్ నగర్ లోని మిన్ మయన్ లో అంత్యక్రియలు నిర్వహించినట్లు కమల్ హాసన్ తెలిపారు .
మంత్రి ఉదయనిధి సంతాపం
"నా వ్యక్తిత్వ వికాసానికి శ్రీనివాసన్ ఎంతగానో తోడ్పడ్డారు. ఆయన తన విప్లవాత్మక ఆలోచనలు, ధైర్య సాహసాల విషయంలో ఓ విరోచితమైన వ్యక్తి" అని కమల్ హాసన్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో తన సంతాపాన్ని పోస్ట్ చేశారు. శ్రీ శ్రీనివాసన్ మృతి పట్ల మంత్రి ఉదయనిధి కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీనివాసన్ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. కమల్ హాసన్ కు సినీ రాజకీయ రంగాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీనివాస్ మరణం ఆయన కుటుంబానికి ముఖ్యంగా కమల్ హాసన్ కు తీరని లోటు అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.