Page Loader
#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2023
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన మరణం తెలుగు ఆడియన్స్‌ని తీవ్రంగా బాధించింది. కృష్ణ మరణించిన ఏడాది కావస్తున్నా ఇంకా కృష్ణని గుర్తు చేసుకుంటూ ఆయన అభిమానులు సేవా కర్యాక్రమాలను చేస్తూనే ఉన్నారు. ఇటీవలే కృష్ణ సొంతగ్రామమైన బుర్రిపాలెంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని లోకనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ కూడా హజరయ్యారు.

Details

వియవాడలోని గురునానక్ కాలనీలో కృష్ణ విగ్రహాం ఏర్పాటు

విజయవాడలోని గురునానక్ కాలనీలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు ప్రజలందరి అభిమాననటుడు కృష్ణ విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనంగా ఉందని దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవ కార్యక్రమాల్లో కృష్ణ పేరును నిలబెడుతున్నారని ఆయన కొనియాడారు. అలాగే కృష్ణ విగ్రహావిష్కరణ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్‌కు, కృష్ణ కుటుంబ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక నగర ప్రజల తరపున కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు లోకనాయకుడు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలియజేశారు.