Page Loader
Nagarjuna: రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌
రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

Nagarjuna: రజనీకాంత్ కూలీ సినిమా నుండి కింగ్ నాగార్జున ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2024
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

రజనీకాంత్ త్వరలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో "కూలీ" చిత్రంలో నటించబోతున్నారు. ఈ చిత్రం రజినీకాంత్ 171వ సినిమా అవుతుంది. ఇప్పటికే, సినిమాకు సంబంధించిన చిన్న గ్లింప్స్ విడుదలయ్యాయి.మొదట్లో నాగార్జున ఈ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.తాజాగా ఈ వార్తపై స్పష్టత వచ్చింది. నేడు నాగార్జున పుట్టిన రోజును పురస్కరించుకొని,"కూలీ" సినిమాలో నాగార్జున పాత్ర గురించి అధికారిక ప్రకటన విడుదలైంది. పోస్టర్ ద్వారా,నాగార్జున ఈ సినిమాలో'సైమన్'అనే పాత్రలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ పోస్టర్‌లో,నాగార్జున స్టైలిష్ లుక్‌లో కళ్ళజోడు ధరించి,చేతిలో వాచ్ పట్టుకొని కనిపిస్తున్నాడు. ఈ లుక్ ద్వారా నాగార్జున సరికొత్తగా కనిపిస్తున్నాడు. దీనితో, టాలీవుడ్ ప్రేక్షకులలో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. లోకేష్ కనగరాజ్ ఈ పాత్రను ఎలా మలిచారో చూడాలి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సన్ పిక్చర్స్ చేసిన ట్వీట్