Kubera: కుబేర గ్లింప్స్ అప్‌డేట్ పోస్టర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఆయన నటిస్తున్న తాజా చిత్రం "కుబేర" శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతుంది.
ఈ చిత్రంలో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీమెల్ లీడ్ రోల్ పోషిస్తుండగా,అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
ఇటీవల "కుబేర" చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ గ్లింప్స్‌ను ఈ రోజు సాయంత్రం 5:31 గంటలకు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
పోస్టర్‌లో ధనుష్, అపార్ట్‌మెంట్స్,బిల్డింగ్స్,నోట్ల ఫొటోలు కనిపిస్తాయి.ఈ లుక్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచింది.
"ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది"అనే మాటతో ధనుష్ చెదిరిన వెంట్రుకలు,మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తుండగా,ఆయన లుక్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నది.
వివరాలు
కీలక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్
ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పీ రామ్‌మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఒక సోషల్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. "కుబేర" ను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని భావిస్తున్నారు.
అలాగే, ఈ చిత్రంలో పాపులర్ బాలీవుడ్ యాక్టర్ జిమ్ సర్బ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన జిమ్ సర్బ్ పాత్ర లుక్‌లో, స్టైలిష్ సూట్‌లో నోట్ల కట్టల మధ్య నిల్చొని ఆసక్తిని రేకెత్తించాడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
#KuberaGlimpse releasing at 𝟓:𝟑𝟏 𝐩𝐦 today!
— BA Raju's Team (@baraju_SuperHit) November 15, 2024
Get ready to witness the world of Kubera 💥@dhanushkraja KING @iamnagarjuna @iamRashmika @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @nikethbommi #PingaliChaithanya @AsianSuniel #Puskurrammohan @SVCLLP @amigoscreation… pic.twitter.com/8Mc1ERKvOh