Page Loader
Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్

Kubera: విభిన్నమైన ప్రెజెంటేషన్‌లో 'కుబేర' టీజర్‌ రిలీజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
04:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

హీరో నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కుబేర' ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతోంది. సినిమా జూన్ 20న విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం ప్రత్యేక టీజర్‌ను రిలీజ్ చేసింది. 'ట్రాన్స్ ఆఫ్ కుబేరా' అనే టైటిల్‌తో వచ్చిన ఈ టీజర్‌లో సంభాషణలు లేకుండానే విజువల్ ప్రెజెంటేషన్‌ను ఆధారంగా తీసుకున్నారు. 'నాది నాది.. నాదే ఈ లోకమంతా' అనే పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ, సినిమాకు సంబంధించిన నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. టీజర్‌లోని మ్యూజిక్, మూడ్, విజువల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ టీజర్ విడుదలతో శేఖర్ కమ్ముల మరో విభిన్న కథను ప్రేక్షకులకు అందించనున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.