LOADING...
Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాట గ్రాండ్ లాంచ్ 

Kuberaa: ముంబయిలో 'కుబేర' నుండి 'పీ పీ డుమ్‌ డుమ్‌' పాట గ్రాండ్ లాంచ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
05:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'కుబేర'. ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు SVCLLP బ్యానర్ పై అత్యున్నత బడ్జెట్‌తో, అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. 'కుబేర' సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని పాట 'పీ పీ డుమ్ డుమ్'ను ముంబయిలో ఘనంగా విడుదల చేశారు.

వివరాలు 

టీమ్‌ అంతా చాలా పాజిటివ్‌గా..

ఈ పాట విడుదల కార్యక్రమంలో హీరో ధనుష్ తమిళంలో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచారు. "అందరికి నమస్కారం. కుబేర నా హృదయానికి బాగా దగ్గరైన ప్రత్యేకమైన సినిమా. ఇది పూర్తిగా భిన్నమైన కథాంశంతో సాగుతుంది. షూటింగ్ సమయంలో నాకు అద్భుతమైన అనుభవం కలిగింది. నాగార్జున గారితో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మా టీమ్‌ అంతా చాలా పాజిటివ్‌గా ఉండేది. ఈ సినిమాలో నేను బెగ్గర్ పాత్రను పోషించాను. అయితే, ఈ పాత్ర కోసం నేను చాలా రీసెర్చ్ చేశానని చెప్పను (నవ్వుతూ). కానీ మా డైరెక్టర్ శేఖర్ గారిని ఫాలో అవుతూ నటించాను. ఆయన నిజంగా ఒక బ్రిలియంట్ డైరెక్టర్."

వివరాలు 

శేఖర్ కమ్ముల ఎనర్జీ నాకు ఎంతో నచ్చింది: ధనుష్ 

"ఇంతవరకు నేను ఎన్నడూ చేయని కొత్త తరహా పాత్ర ఇది. శేఖర్ కమ్ముల గారు చాలా స్వచ్ఛమైన వ్యక్తి. ఆయన వల్లనే ఈ సినిమా చేయాలని నేను నిర్ణయించాను. ఆయన కథను నాకు 20 నిమిషాల్లో వివరించారు. ఆయనలో ఉన్నఎనర్జీ నాకు ఎంతో నచ్చింది.వెంటనే ఓకే చేశాను.ఇది చాలా నిజాయితీగా రూపొందించిన చిత్రం.ఈ సినిమా నా బాల్యాన్ని గుర్తు చేసింది."

వివరాలు 

డంప్‌యార్డ్‌లో 7 గంటల పాటు షూటింగ్

"ఒక డంప్‌యార్డ్‌లో నేను, రష్మిక కలసి సుమారు 7 గంటల పాటు షూటింగ్ చేశాం. అక్కడ అంతసేపు ఉన్నా, ఆమెకి ఏం బాధలేదని చెప్పింది - 'నాకేం వాసన రావట్లేదు' అంటూ నవ్వింది. ఆమెకు నిజంగా ఏమైందో నాకు మాత్రం తెలియదు (నవ్వుతూ). కుబేర సినిమా నాకు ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. జూన్ 20న థియేటర్లలో ఈ సినిమాను తప్పక చూడండి. మీ అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది" అని ధనుష్ అన్నారు.