
Lal Salaam trailer:"లాల్ సలామ్" తెలుగు ట్రైలర్ విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన "లాల్ సలామ్" తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
జీవిత, విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు.
ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మీ మూవీస్ గ్రాండ్‌గా విడుదల చేస్తోంది.
ఇక ట్రైలర్ ప్రారంభంలోనే..'ఊర్లో ఒక్క మగాడు లేడా? ఊర్లో ఉన్నొళ్లందరినీ తీసుకెళ్లి బొక్కలే వేశారు' అనే డైలాగ్ వినిపిస్తుంది.
Details
ఈ సినిమాకీలక పాత్రలో మాజీ క్రికెట్ దిగ్గజం
ఆ తరువాత ట్రైలర్ లో ఊరి వాతావరణం,క్రికెట్ ఆట,జాతర సీన్లు,రాజకీయంతో ముడిపడ్డ సన్నివేశాలను చూపించారు.
'మందిని కూడ బెట్టేవాడి కన్నా..ఎవడి వెనకాల మంది ఉంటారో వాడే చాలా ప్రమాదకరం..వాడ్ని ప్రాణాలతో వదిల పెట్టకూడదు'అనే మాస్ డైలాగ్‌తో రజినీకాంత్ ఎంట్రీ అదిరిపోతుంది.
'బిడ్డ సంపాదిస్తే ఇంటికి గౌరవం..బిడ్డ సాధిస్తే దేశానికే గౌరవం','మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో.. మానవత్వాన్ని అందరితో పంచుకో.. ఇండియన్‌గా నేర్చుకోవాల్సింది అదే' అంటూ రజినీకాంత్ చెప్పే డైలాగ్స్ ఆలోచింప చేస్తాయి.
ఇక ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్,క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ నటించారు.
రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ ఇప్పుడ 'లాల్ సలామ్'తో రానుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.