
Lokesh Kangaraj: 'కూలీ'.. ఆ ఒక్క సీన్ కోసం రెండేళ్ల ప్రణాళిక: లోకేశ్ కనగరాజ్
ఈ వార్తాకథనం ఏంటి
"ఖైదీ","విక్రమ్" వంటి సూపర్‌హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనగరాజ్,రజనీకాంత్ హీరోగా తెరకెక్కించిన తాజా చిత్రం "కూలీ" ఈ నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. అదే సమయంలో తన టీమ్‌తో కలిసి ఓ చిట్‌చాట్‌లో కూడా పాల్గొన్నారు. వాటిలోని కొన్ని ఆసక్తికర విశేషాలివీ..
వివరాలు
ఆ రోజు బాధ పడ్డా..
"కూలీ" సినిమా ఇంటర్వెల్ సీన్‌పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ నాకు ఉంది.ఎందుకంటే రజనీకాంత్ సర్‌ను నేను తొలిసారి డైరెక్ట్ చేస్తున్నాను కాబట్టి, ఇంటర్వెల్ సీన్ దుమ్ము దులిపేలా ఉండాలని మొదట నుంచే భావించాను. ఆ ఒక్క సీన్‌కు ప్లానింగ్ దాదాపు రెండేళ్లపాటు సాగింది. ఒక సందర్భంలో రజనీకాంత్ గారికి శ్రుతిహాసన్ నటనను చూపించాను. అప్పుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ, మరుసటి రోజు ఆమెకు స్వీట్లు పంపించి అభినందించారు. అలాగే సౌబిన్ షాహిర్ నటన కూడా ఆయనను బాగా ఆకట్టుకుంది. ఎన్నో జ్ఞాపకాలు అందించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిన రోజు బాధ పడ్డా''అని లోకేశ్ కనగరాజ్ తెలిపారు.
వివరాలు
త్వరలో 'ఖైదీ 2'
"లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో భాగంగా త్వరలోనే "ఖైదీ 2" సినిమాను ప్రారంభించబోతున్నాను. ఇందులో విక్రమ్, లియో సినిమాల్లో కనిపించిన పాత్రలు మళ్లీ ప్రత్యక్షమవుతాయి. ఇప్పటివరకు దాదాపు 35 పేజీల కథ రాసాను. 'కూలీ' విడుదలైన తర్వాత వెంటనే 'ఖైదీ 2'ను మొదలుపెట్టే ప్లాన్‌లో ఉన్నాను.అంతేకాకుండా, విక్రమ్ సినిమాలో కనిపించిన ఏజెంట్ టీనా పాత్ర ఆధారంగా ఓ ప్రత్యేక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అయితే ఆ వెబ్‌సిరీస్‌ను నేను కాకుండా వేరే దర్శకుడు తెరకెక్కిస్తారు: అని చెప్పారు.
వివరాలు
అందుకే విలన్‌గా నటించలేకపోయాను...
శివ కార్తికేయన్ హీరోగా నటించిన "పరాశక్తి" సినిమాలో విలన్ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. ఆ చిత్ర దర్శకురాలు సుధా కొంగరను రెండు సార్లు కలిశాను. ఆమె చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. శివ కార్తికేయన్ కూడా నన్ను ప్రోత్సహించాడు. నాకు నటించాలన్న ఉత్సాహం కూడా ఉంది. కానీ కూలీ'ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న ఉద్దేశంతో ఆ అవకాశం వద్దన్నాను. ఇక 'కూలీ' పూర్తైన తర్వాత, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు అంగీకరించాను" అని లోకేశ్ తెలిపారు.