LOADING...
Happy Birthday Mahesh Babu: రాజకుమారుడి అందం,బంగారు హృదయం.. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు
రాజకుమారుడి అందం,బంగారు హృదయం.. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు

Happy Birthday Mahesh Babu: రాజకుమారుడి అందం,బంగారు హృదయం.. ఇది సూపర్ స్టార్ మహేష్ బాబు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
10:07 am

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు పేరు వినగానే మన కళ్ల ముందుకు వచ్చే చిత్రం.. అందమైన, సొగసైన రాజకుమారుడు. ఈ రోజు ఆయన తన 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.అయితే ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే,వయసుతో ఆయనకు సంబంధమే లేదన్నట్లుగా ఇప్పటికీ తన గ్లామర్‌తో చూపు తిప్పుకోనివ్వడు. ఇప్పటికీ టీనేజర్‌లా కనిపించే ఆయన, తన కుమారుడికి సోదరుడిలా కనిపిస్తారు. "టాలీవుడ్‌లో అత్యంత హ్యాండ్సమ్ హీరో ఎవరు?" అనే ప్రశ్న వస్తే, మొదటి వరుసలో ఉండే పేరు మహేష్ బాబుదే. కానీ ఆయన కేవలం రూపంతోనే కాదు,తన సౌమ్యమైన వ్యక్తిత్వంతో కూడా అందరి మనసులను గెలుచుకున్నారు. అభిమానుల హృదయాలను చాకచక్యంగా దోచుకున్న ఆయన,తండ్రి దగ్గర నేర్చుకున్న పాఠాలతో తన జీవితానికి బంగారు బాటలు వేసుకున్నాడు.

వివరాలు 

ఎప్పుడూ తప్పు చేయని జీవితం 

ముఖ్యంగా పేద చిన్నారుల సహాయంలో చేయడంలో ఆయనకు ఎవరూ సరిలేరు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహేశ్ బాబు ఫౌండేషన్‌ గురించి ఒకసారి తెలుసుకుందాం. మహేష్ బాబు ఎప్పుడూ చిరునవ్వుతోనే కనిపిస్తారు. "ముఖంపై ఉండే చెరగని నవ్వే నిజమైన అందం" అని ఆయన ఒకసారి చెప్పారు. ఆ చిరునవ్వు మనసు నుండి రావాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలి అని ఆయన భావన. తన జీవితం ఇలా ప్రశాంతంగా ఉండటానికి కారణం.. ఎప్పుడూ తప్పు చేయకపోవడమేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎలాంటి తప్పు చేయబోనని, ఆ నమ్మకం తనలో తండ్రి ప్రభావం వల్లే వచ్చిందని పలుమార్లు చెప్పారు.

వివరాలు 

చిన్న హృదయాల రక్షకుడు 

మహేష్ బాబు ఇప్పటి వరకు 4,500కి పైగా చిన్నారుల గుండె ఆపరేషన్లకు సహాయం చేసి, వారికి కొత్త జీవితం ఇచ్చారు. సాయం కోరిన ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తూ, పేద పిల్లల కోసం ఉచిత ఆపరేషన్లు చేయించాలన్న నిర్ణయం మహేశ్ దంపతులు తీసుకున్నారు. విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్‌ ద్వారా వేలాది చిన్నారులకు వైద్య సాయం అందించగా, తెలంగాణలో 'ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్‌' ద్వారా హైదరాబాద్‌లో కూడా హార్ట్ సర్జరీలు ప్రారంభించారు. ఈ కారణంగా అభిమానులు ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. "రాళ్లలో దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ, ఇన్ని ప్రాణాలను కాపాడిన మా మహేశ్వరుడిలో ఖచ్చితంగా ఉన్నాడు" అని వారు గర్వంగా చెబుతారు.

వివరాలు 

ఫౌండేషన్ స్థాపనకు ప్రేరణ 

మహేష్ కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు గుండె సమస్యతో బాధపడ్డాడు. ఆర్థికంగా సౌలభ్యం ఉండటంతో శస్త్రచికిత్స చేయించగలిగారు. కానీ పేద పిల్లలు డబ్బుల్లేక చికిత్స పొందలేకపోతున్నారని గ్రహించిన మహేశ్ బాబు ను ఈ విషయం ఎంతో కలవరపెట్టింది. అందుకే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత హృదయ శస్త్రచికిత్సలు అందించాలన్న ఉద్దేశంతో 2020లో తన భార్య నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ప్రత్యేకత ఏమిటంటే, ఫౌండేషన్ వెబ్‌సైట్‌లోనే నేరుగా సహాయం కోసం రిక్వెస్ట్ పెట్టే అవకాశం కల్పించారు.

వివరాలు 

నిధుల వ్యవహారం 

సమాచారం ప్రకారం, మహేశ్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం దాదాపు ₹50 కోట్లను చిన్నారుల గుండె ఆపరేషన్లకు వెచ్చిస్తున్నారు. తన సంపాదనలో సుమారు 30%ను సేవా కార్యక్రమాలకు కేటాయిస్తారు. ఉచిత వైద్య శిబిరాలు, బాలికలకు సర్వికల్ క్యాన్సర్‌ వ్యాక్సిన్లు, పాఠశాలలకు కంప్యూటర్లు అందించడం వంటి పనులతో పాటు, ఆయన దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిలో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకొని, అక్కడి ఆసుపత్రులు, పాఠశాలలు సహా అనేక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

వివరాలు 

సహాయం కోసం ఎలా సంప్రదించాలి? 

సినిమా రంగంలో మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాల్లోనూ ఆదర్శంగా నిలిచిన మహేశ్ బాబును అభిమానులు "మహేశ్వరుడు" అని పిలుస్తారు. ఆయన ఫౌండేషన్ వెబ్‌సైట్‌ (https://www.maheshbabufoundation.org/request) లోకి వెళ్లి,పేద పిల్లల హార్ట్ సర్జరీ కోసం పూర్తి వివరాలతో రిక్వెస్ట్ పంపితే, ఫౌండేషన్ టీమ్‌ ప్రత్యక్షంగా సంప్రదిస్తుంది. ఇటీవల ఆయన అభిమానులు తమ సోషల్ మీడియా బయోలో ఈ లింక్‌ను షేర్ చేశారు. సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు ఆయన సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఫ్యాన్ వార్ పేరుతో కొందరు విమర్శించినా, ఆయన చేసిన మంచిపనులే సమాధానం ఇస్తాయి.

వివరాలు 

సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ 

తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తొలి వర్థంతి సందర్భంగా మహేశ్ బాబు "సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్‌"ను ప్రారంభించారు. ఇది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడమే లక్ష్యం. తొలి సంవత్సరంలోనే 40 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు. పాఠశాల చదువు నుంచి పీజీ వరకు ఉపకార వేతనం అందిస్తారు. భవిష్యత్తులో ఈ లబ్ధిదారుల సంఖ్యను మరింత పెంచే ప్రణాళిక ఉంది.

వివరాలు 

తండ్రి బాటలో కూతురు 

మహేశ్ బాబు కూతురు సితారకు కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పీఎంజే జ్యువెలరీ ప్రకటనలో నటించి, దాదాపు ₹1 కోటి పారితోషికం పొందింది. అయితే, తన మొదటి సంపాదన మొత్తాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇచ్చింది. ఈ నిధులు వృద్ధుల ఆరోగ్యం, ఆహారం, అవసరాల కోసం వినియోగించారు. తన తండ్రిలా సేవా దృక్పథం కలిగి ఉండటం వల్ల సితారను ఎంతో మంది అభినందించారు.

వివరాలు 

టాలీవుడ్‌లో తిరుగులేని రికార్డులు 

మహేశ్ బాబు ఇంకా పాన్ ఇండియా సినిమాల్లో నటించలేదు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులోనే విడుదలయ్యాయి. అయినప్పటికీ, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆయన రికార్డులు చూసి ఎవరైనా ఆశ్చర్యపడతారు. కొన్ని ప్రాంతీయ చిత్రాలు కూడా పాన్ ఇండియా కలెక్షన్లతో సమానంగా నిలిచాయి. సర్కారు వారి పాట - ₹214 కోట్లు, సరిలేరు నీకెవ్వరు - ₹260 కోట్లు, మహర్షి - ₹170 కోట్లు, గుంటూరు కారం - ₹200 కోట్లు, భరత్ అనే నేను - ₹187 కోట్లు ఒక్క భాషలోనే ఇంతటి వసూళ్లు సాధించగలిగితే, ఆయన పాన్ ఇండియా రేంజ్‌లో నటిస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.