LOADING...
Actor Ravi kumar: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు రవి కుమార్ క‌న్నుమూత 
మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు రవి కుమార్ క‌న్నుమూత

Actor Ravi kumar: మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విషాదం.. ప్ర‌ముఖ న‌టుడు రవి కుమార్ క‌న్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
05:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మలయాళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి.ప్రముఖ నటుడు రవి కుమార్ (71) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నిరవి కుమార్ కుమారుడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.రవి కుమార్ మరణ వార్తపై మలయాళ సినీ ప్రముఖులతో పాటు తమిళ సినీ రంగంలోని ప్రముఖులు కూడా దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన రవి కుమార్,1975లో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టారు. 'ఉల్లాస యాత్ర','అవరగళ్','సీబీఐ 5','పరమానందం' వంటి చిత్రాలలో నటించి విశేషమైన గుర్తింపు సంపాదించారు. అలాగే తమిళంలో 'అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు', 'రమణ', 'ఆనంద రాగం' వంటి సినిమాల్లో నటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నటి రాధికా శరత్ కుమార్ చేసిన ట్వీట్