Page Loader
Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!
త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!

Trisha : త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్.. ఆమె పెళ్లికి మంగళసూత్రం ఇచ్చి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 24, 2023
03:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష(Trisha) కు తమిళ నటుడు మన్సూర్ ఆలీఖాన్ క్షమాపణలు చెప్పారు. త్రిషపై ఆయన ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో త్రిష కు మద్దతుగా తమిళ, టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మొదట క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చిన మన్సూర్ తాజాగా వెనక్కి తగ్గారు. త్రిషపై తనకు ఎలాంటి దురుద్ధేశం లేదని, తాను సరదాగా ఆ వ్యాఖ్యలు చేశానని మన్సూర్ పేర్కొన్నాడు.

Details

మన్సూర్ వ్యాఖ్యలపై స్పందించిన సినీ ప్రముఖులు

త్రిష పెళ్లికి తాను మంగళసూత్రం ఇచ్చి ఆశీర్వదించాలనుకుంటున్నానని మన్సూర్ చెప్పాడు. ప్రస్తుతం ఈ పస్ట్ నెట్టింట్ వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ మాట్లాడుతూ గతంలో తాను ఎన్నో రేప్ సీన్లలో నటించానని, అయితే 'లియో' అవకాశం వచ్చినప్పుడు త్రిషతో అలాంటి సన్నివేశం ఉంటుందని అనుకున్నట్లు చెప్పాడు. ఆ సన్నివేశం లేకపోవడం బాధగా అనిపించిందన్నాడు. ఈ వ్యాఖ్యలపై త్రిష స్పందిస్తూ ఇలాంటి వారి వల్లే అందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. ఇక మాన్సూర్ వ్యాఖ్యలను చిరంజీవి, లోకేశ్ కనగరాజ్, నితిన్, రోజా, రాధిక ఖండించారు.