LOADING...
Mega 158 : మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?
మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?

Mega 158 : మెగా సినిమాలో నారా హీరోకు కీలక పాత్ర?

వ్రాసిన వారు Moogati Shabari
May 31, 2026
02:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, మాస్ చిత్రాల దర్శకుడు బాబీ తెరకెక్కించనున్న 'మెగా 158' చిత్రం ఇప్పటికే ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకోగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇంతకుముందు చిరంజీవి - బాబీ కలయికలో వచ్చిన 'వాల్తేరు వీరయ్య' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'మెగా 158'పై సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

వివరాలు

ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ..

ఇదిలా ఉంటే, ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ యువ హీరో నారా రోహిత్ పేరును పరిశీలిస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ప్రాధాన్యత కలిగిన పాత్ర కోసం పలువురు నటుల పేర్లను పరిశీలించిన అనంతరం నారా రోహిత్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే, బాబీ శైలిలోని మాస్ అంశాలతో పాటు చిరంజీవి - నారా రోహిత్ కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశముంది.

వివరాలు

త్వరలోనే అధికారిక ప్రకటన..

అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కన్నడకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, లోహిత్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సంగీత బాధ్యతలను టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి ప్రియమణి ముఖ్య పాత్రలో కనిపించనుండగా, మలయాళ నటి అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

Advertisement