LOADING...
Chiranjeevi: చిరంజీవిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా అభిమాని
చిరంజీవిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా అభిమాని

Chiranjeevi: చిరంజీవిని కలిసేందుకు సైకిల్‌పై వచ్చిన మహిళా అభిమాని

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

నటీనటులపై అభిమానుల చూపే ప్రేమ అద్భుతంగా ఉంటుంది. తమ ఇష్టమైన తారలను చూడడానికి అభిమానులు సాహసాలు కూడా చేస్తుంటారు. ఇటీవలే ఒక మహిళా తన అభిమాన హీరో చిరంజీవిని చూసేందుకు సైకిల్‌పై హైదరాబాద్ వచ్చి తన ఇష్టాన్ని చాటుకున్నారు. చిరు కూడా ఆమెను ఆప్యాయంగా పలకరించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన రాజేశ్వరి చిరంజీవిని చూడాలనుకుని సుమారు 300 కిలోమీటర్లను సైకిల్‌ తొక్కుతూ హైదరాబాద్ చేరారు. అక్కడ ఆమె మెగాస్టార్‌ను కలిశారు. రాఖీ కట్టి, ఆనందంతో అభిమానాన్ని వ్యక్తం చేశారు. చిరంజీవి ఆమెను ఆప్యాయంగా పలకరించి, ఆర్థిక సాయం కూడా అందించారు. అదనంగా, ఆమె పిల్లల విద్యకు సంబంధించిన పూర్తి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.

వివరాలు 

 'మన శంకరవరప్రసాద్‌గారు'తో బిజీగా చిరంజీవి 

పిల్లలు ఎంతవరకు చదువుకుంటే, అంతవరకు చదివిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఘటన చూసిన అభిమానులు, "దటీజ్ మెగాస్టార్" అని కామెంట్లు చేస్తున్నారు. అభిమానానికి హద్దులుండవని మరోసారి నిరూపించారంటూ ఈ వీడియోను షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి రెండు ప్రాజెక్టులలో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో సొషియో ఫాంటసీ శైలిలో రూపొందుతున్న 'విశ్వంభర' సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో 'మన శంకరవరప్రసాద్‌గారు' (Mana Shankaravaraprasad garu) సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులను అలరించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టీం మెగాస్టార్ చేసిన ట్వీట్