
Chiranjeevi : లాస్ ఏంజెల్స్‌లో చిరంజీవికి మెగా సన్మానం.. వీడియో వైరల్
ఈ వార్తాకథనం ఏంటి
పద్మవిభూషణ్ చిరంజీవికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రైమ్ ఓనర్ టీజీ విశ్వప్రసాద్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
కాగా,నిన్న రాత్రి అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సన్మాన కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,USA మెగాఅభిమానులు ఈకార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తనను సత్కరించిన అభిమానులకు మెగాస్టార్ ధన్యవాదాలు చెప్పారు.
తనపై కురిపిస్తున్నఈ ప్రేమ,అభిమానానికి చాలా సంతోషంగా ఉందన్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా,త్వరలోనే టాలీవుడ్ ఫిలిం కౌన్సిల్ చిరంజీవిని సత్కరించనుంది.
ఈ ఈవెంట్ కి ఇండస్ట్రీలోని హీరోలు,స్టార్ మేకర్స్ అంతా కూడా వచ్చేలా నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చిరంజీవిని సన్మానం వీడియో ఇదే
Padma Vibhushan Dr. Mega star @KChiruTweets in Los Angeles, being felicitated by the beloved USA Mega fans. It is fame and love across and beyond boundaries ♥️#PadmaVibhushanChiranjeevi #MegastarChiranjeevi #PeoplesPadma #PadmaAwards2024 pic.twitter.com/8OoJBSiAJe
— BA Raju's Team (@baraju_SuperHit) February 19, 2024